అభ్యర్థులు 2026 జనవరి 1 తేదీ నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్లను బట్టి సడలింపు కలదు.. (అంటే జనవరి 2003 నుంచి 2008 మధ్య జన్మించాలి)
డిసెంబర్ 31- 2025 తేదీ వరకే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని అవకాశం కల్పించారు.
దరఖాస్తు ఫీజు కింద కేవలం రూ .100 రూపాయలు చెల్లించాలి. అయితే ఎస్టి, ఎస్సీ ,ఎక్స్ సర్వీస్ మెన్లకు ఈ దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు కలదు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఆన్లైన్ రాత పరీక్షను నిర్వహిస్తారు.
ఆ తర్వాత పిఈటి/పిఎస్టి , వైద్య పరీక్షలు డాక్యుమెంట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 1- 2025
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: డిసెంబర్ 31-2025
దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: జనవరి 1- 2026
ఆన్లైన్ దరఖాస్తుల సవరణ : జనవరి 8 - 2026 తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉంటుంది.
రాత పరీక్ష తేదీలు: ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో జరగవచ్చు..
ఆసక్తి కలిగి ఉన్న నిరుద్యోగులు సైతం ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలతో అధికారిక నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి