ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి క్రైస్తవ మతాన్ని తీసుకొని పాస్టర్ గా కూడా ఉన్నారు. అయితే ఆయనకు తాజాగా ఎస్సీ రిజర్వేషన్ రద్దయింది. ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై మీరు మతం మార్చుకున్నారు పాస్టర్ కాబట్టి రద్దయిందంటూ తెలియజేసింది. ఈ విషయంపై ఉత్తరప్రదేశ్లో జితేంద్ర సుహాని అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మాత్రం ఒక సంచలన తీర్పు ఇచ్చింది.ఇతర మతాలలోకి మారిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లను ఉపయోగించుకోవడం రాజ్యాంగాన్ని మోసం చేయటమే అన్నట్టుగా తెలియజేసింది.

అసలు విషయంలోకి వెళ్తే..మహారాజ్ గంజ్ జిల్లాకు చెందిన జితేంద్ర సుహాని అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో రిజర్వేషన్ కు సంబంధించి  పిటిషన్ వేయగా విచారణ అనంతరం.. కోర్టు ఆదేశాలను జారీ చేసింది. హిందూ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మతాంతికరణను ప్రోత్సహిస్తున్నారని తనమీద తప్పుడు అభియోగాలు నమోదయయ్యాయని వాటిని ఎలాగైనా కొట్టేయాలి అంటూ జితేంద్ర పిటిషన్లో అభ్యర్థించారు. ఈ పిటిషన్ పైన నిన్నటి రోజున విచారణ జరపగా తన మీద నమోదైన అభియోగాలన్నీ కూడా అవాస్తవమని అధికారుల అనుమతి తీసుకొని తాను ప్రార్థన సమావేశాలను నిర్వహిస్తున్నానంటూ తెలియజేశారు జితేంద్ర. ఈ విషయంపై సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించన జడ్జ్ జితేంద్ర పుట్టుక హిందూ మతం అని ఆ తర్వాత క్రైస్తవం లోకి మారి పాస్టర్ గా మారారని గుర్తించారు.కానీ కోర్టుకు సమర్పించినటువంటి అఫీడవిట్లో తనని తాను హిందువుగా పేర్కొనటాన్ని ప్రశ్నించారు.. అంతరం జితేంద్ర సమర్పించిన వివరాలను పరిశీలించి ఆయన మతానికి సంబంధించిన వాటిలో తప్పులుంటే కఠినమైన చర్యలు తీసుకోవాలంటే కలెక్టర్కు ఆదేశాలను జారీ చేశారు.


ఈ మేరకు రాజ్యాంగ నిబంధన 1950 ప్రస్తావిస్తూ.. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందిన వారు కాకుండా ఇతర మతాలకు చెందిన వారిని ఎస్సీ వర్గానికి చెందిన వారిగా గుర్తించడం అసలు సాధ్యం కాదని ఈ నిబంధన స్పష్టం చేస్తుందంటూ తెలియజేసింది. షెడ్యూల్ కులాలకు మాత్రమే రిజర్వేషన్స్ ఇచ్చారు.. ఇప్పుడు నువ్వు ఆ కులం నుంచి మతం మారిన  తర్వాత కూడా ఎస్సీ హోదాను ఉపయోగించుకోవడం రిజర్వేషన్ భావనకే విరుద్ధమంటూ తెలియజేసింది కోర్టు. రాజ్యాంగం ప్రకారం మతమార్పిడి తర్వాత పాత రిజర్వేషన్ వర్తించదంటూ తెలిపిందని కోర్టు తెలియజేసింది. ఈ విషయం కోర్టులో పతాక స్థాయికి చేరడంతో జస్టిస్ ప్రవీణ్ కుమార్ క్లియర్గా యోగి సర్కార్ కి ఒక ఆర్డర్ వేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలోని కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసింది. మీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఎస్సీ రిజర్వుడ్ వారు మతం మారి ఉంటే వెంటనే ఆ రిజర్వేషన్ ని రద్దు చేయాలంటూ.. మతం మారకుండా ఉంటే ఆ రిజర్వేషన్స్ వర్తిస్తాయి అంటూ ఇలాగే అన్ని మతాల వారిని పరిశీలించి ఈ రిజర్వేషన్లను  క్లైమ్ చేసే వాళ్ళు ఉంటే ఎవరైనా మూడు నెలల లోపు ఒక నివేదిక ఇవ్వండి అంటూ జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: