ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోనసీమ కొబ్బరి చెట్ల నష్టానికి.. తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది అంటూ చేసిన వ్యాఖ్యలు గత నాలుగు ఐదు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యాఖ్యల పైన ఇప్పటికే తెలంగాణ నేతలు కూడా పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. దీంతో పవన్ కళ్యాణ్ మీద చాలానే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఎవరు కావాలని వక్రీకరించవద్దు అంటూ జనసేన పార్టీ నుంచి ఒక అప్పీల్ రిలీజ్ చేశారు. ఇటువంటి తరుణంలోనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పలు వ్యాఖ్యలు చేసింది.


ఉపముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం సరైనది కాదు, వెంటనే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నదమ్ముల్లా ఉన్న ఆంధ్రా ,తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ ప్రాంతీయ విద్వేషాలను సైతం నింపే ప్రయత్నం చేయకూడదని తెలిపారు షర్మిల. ఉప్పునీటి ముప్పు వల్లే కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయని, కోనసీమలో శంకరగుప్తం డ్రైనేజీ , డ్రైనేజ్ కు ఇరువైపులా గట్లును ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటూ అక్కడ స్థానికులు తెలియజేస్తున్నారని తెలిపింది షర్మిల.


సముద్రం నుంచి పైకి వస్తున్న ఉప్పునీటి ప్రవాహాన్ని అడ్డుకునే విధంగా చర్యలు చేపట్టాలని, అలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల లక్ష సంఖ్యలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయంటూ షర్మిల మాట్లాడింది. ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి మీద రుద్దడం సరైనది కాదు, కోనసీమ రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని రూ.3,500 కోట్ల రూపాయలను కేటాయించి శాశ్వతమైన పరిష్కారాన్ని చేపట్టాలంటు షర్మిల డిమాండ్ చేస్తోంది. కోనసీమ కొబ్బరి చెట్ల రైతుల  పైన కూటమి ప్రభుత్వానికి నిజమైన ప్రేమ ఉంటే వెంటనే రైతుల సమస్యలను తక్షణమే పరిష్కారం చూపించాలంటూ తెలియజేసింది షర్మిల.

మరింత సమాచారం తెలుసుకోండి: