మాజీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ముందు ఓట్ల కోసం యాడ్స్ ఇచ్చారని చెబుతూ ఆ యాడ్స్ చూపిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిరుద్యోగ భృతి కింద నెలనెలా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారని రెండేళ్ల డబ్బులు 72,000 రూపాయలు ఇచ్చారా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మనుషులు ఇచ్చిన బాండ్స్ కూడా నేను చుపించానని ఆయన పేర్కొన్నారు. సూపర్ సిక్స్ ఎక్కడ అమలైంది జగన్ అన్నారు.
ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ళు నిండిన ప్రతి అక్కకు, చెల్లికి 36,000 రూపాయలు ఇచ్చాడా అని జగన్ కామెంట్లు చేశారు. 50 ఏళ్లకే పెన్షన్ అన్నారని రెండేళ్లకు కలిపి 96,000 రూపాయలు ఎవరికీ ఇచ్చాడని జగన్ పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ కింద 10,000 ఇచ్చి 30,000 ఎగరగొట్టాడని ఆయన తెలిపారు. తల్లికి వందనం ప్రతి పిల్లాడికి ఇస్తానని చెప్పారని తీరా చూస్తే రెండో సంవత్సరం 20 లక్షల మంది పిల్లలకు తగ్గించాడని జగన్ కామెంట్లు చేశారు.
కొందరికి మాత్రమే తల్లికి వందనం 13000 రూపాయలు జమైందని జగన్ వెల్లడించారు. ఇది మోసం కాదా అని జగన్ అన్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు అని చెప్పి రెండు సిలిండర్లు ఇచ్చాడని అది కూడా అందరికీ ఇవ్వలేదని జగన్ పేర్కొన్నారు. ఫ్రీ బస్ ప్రయాణం అంటాడని ఇప్పుడు చూస్తే కొన్ని బస్సులకే అని చెబుతున్నారని ఇది మోసం కాదా అని జగన్ వెల్లడించారు.
చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టవచ్చని ఆయన అన్నారు. చంద్రబాబు చేసింది ఫ్రాడ్ అని ఆయన తెలిపారు. అంతా గజదొంగల ముఠా అని వీళ్ళ గురించి ఎవరూ రాయరని ఎవరూ చూపించరని జగన్ అన్నారు. జగన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్ చేసిన కామెంట్ల గురించి టీడీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి