పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ. 20,658 కోట్ల రూపాయలు విడుదల చేశామని తెలిపారు. టిడిపి ఎంపీ అప్పలనాయుడు ఆంధ్రప్రదేశ్లో నదుల అనుసంధానం పైన అడిగిన ప్రశ్నకు సిఆర్ పాటిల్ రాతపూర్వకంగానే సమాధానాన్ని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు 2017-18 ధరల ప్రకారమే సహకరించిన అంచనా వ్యయం రూ. 55,656.87 కోట్ల రూపాయలు అవసరమని CWC 2019లోని ఆమోదించిందని తెలిపారు. గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వడంతో 45.72 మీటర్ల గరిష్టమట్టంలో నీటిని నిల్వ చేసుకునేలా పోలవరాన్ని పూర్తి చేయాలంటే అంత నిధులు అవసరం..
అయితే పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ కనీస మట్టం 41.15(MDDL) మీటర్లకే పరిమితం చేస్తూ ఈ ప్రాజెక్టును పూర్తి చేసేలా 2024 ఆగస్టు 28న కేంద్రం ఆమోదించింది. అప్పుడు ఆ పనులు పూర్తి చేయడానికి అంచనా వ్యయం రూ. 30,436 కోట్ల రూపాయలని తేల్చింది. అయితే ఇప్పటివరకు విడుదల చేసిన నిధులను పోను ప్రాజెక్టుకే అవసరమైన రూ. 12,157 కోట్ల రూపాయలను విడుదల చేస్తామంటూ తెలిపారు. ఈ ప్రాజెక్టుని 2027 నాటికి పూర్తి చేయాలనే కండిషన్ పెట్టింది.
పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తుకి నీటి నిలువను పరిమితం చేస్తే అందులో 115.4 టీఎంసీల నీటి మాత్రమే నిలువు చేసుకోవచ్చు.. ఆ స్థాయిలో నీటిని నిలువ చేసుకున్నట్లు అయితే కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల పంట భూములకు నీరు అందించడం సాధ్యం కాదని, కేవలం 2 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని, అది కూడా గోదావరి వరదల సమయంలో మాత్రమే నీటిని అందించే అవకాశం ఉంటుందంటూ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అయితే 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేస్తే సాధ్యమవుతుందని తెలియజేశారు. కానీ నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే కేంద్ర క్యాబినెట్ ఆమోదిస్తున్న సమయంలో టిడిపి మంత్రులు ఎవరు మాట్లాడలేదు. దీంతో పోలవరం రిజర్వాయర్ కానేకాదని కేవలం బ్యారేజ్ గానే మిగిలిపోతుందంటూ నిపుణులు తెలియజేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి