బంగారం, వెండి ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. రోజురోజుకి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. దీంతో సామాన్యులు సైతం గ్రాము బంగారం కొనాలి అంటే కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది.ఆ మధ్య 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,000 వరకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్లీ రూ.1,24,000 రూపాయల వరకు తగ్గింది. దాదాపుగా 12 వేల రూపాయల వరకు తగ్గింది. ఆ ప్రభావం వల్ల చాలామంది కొనేశారు.



 వెండి విషయానికి వస్తే ఆ మధ్య రూ .1,85 ,000 వేల వరకు వెళ్ళింది.రూ 2 లక్షల రూపాయల వరకు బ్లాక్లో ధర పలికింది.మళ్లీ రూ .1,51,000  వేల రూపాయలకు పడిపోగా, దీంతో బంగారం, వెండిలో ధరలలో కరెక్షన్ వచ్చింది అందుకే తగ్గిందని చెప్పారు నిపుణులు. ఇప్పుడు మళ్లీ చూస్తూ ఉంటే గత వారం రోజుల నుంచి బంగారం ధర పెరుగుతూనే ఉంది. రూ.1,20,000  నుంచి రూ 1,26,000 మధ్యలో 22 క్యారెట్ల బంగారం ఉన్నది. అదే సందర్భంలో రూ.1,30,000 రూపాయలకు 24 క్యారెట్ల బంగారం ధర ఉన్నది. వెండి రూ.1,80,000కు తగ్గలేదు.

తద్వారా బంగారం ఒక సంకేతం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. అదేమిటంటే ఇప్పటిలో బంగారం ధర తగ్గే అవకాశాలు లేవని. ఇటువంటి సందర్భంలోనూ వెండి కూడా విపరీతంగా కొనేస్తున్నారు. ఈ రేంజ్ లో మళ్ళీ ధరలు రావని, మొన్న  రూ.80, రూ.90 వేల రూపాయలకు కొన్నటువంటి షాపు యాజమాన్లు రూ .180,000 రావడంతో ధరలలో 20% తగ్గించి మరి అమ్మేస్తున్నారు.


విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,430 ఉండక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,19,560 కొనసాగుతోంది.


హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,430 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,560; వద్ద కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: