అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టడంతో అప్పటినుంచి విదేశీయులు అమెరికాకి అడుగు పెట్టాలంటే ఎన్నో కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా టారిఫ్ లు విధిస్తూ చాలా దేశాలకు తలనొప్పిగా మారుతున్నారు. ముఖ్యంగా తన మాట వినని దేశాలపై సుంకాలతో దాడి చేస్తున్నారు ట్రంప్. ఇండియా ,చైనా వంటి దేశాలపై అదనపు సుంకాలతో వరుసగా దాడులు చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సొంత దేశంలోనే ఇది అన్యాయం అంటూ చెబుతున్న పట్టించుకునే వారే లేరు. ఇప్పుడు తాజాగా ట్రంప్ సర్కార్ మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తోంది.


టూరిస్టులకు సంబంధించి ఐదేళ్లపాటు తమ సోషల్ మీడియా హిస్టరీని అందించాల్సి ఉంటుందని ఈ అంశం  తప్పనిసరి అన్నట్లుగా వినిపిస్తోంది. విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఫేస్ స్క్రీనింగ్ ప్రాసెస్ లో భాగంగా సెల్ఫీలను, ఐదేళ్లు సోషల్ మీడియా హిస్టరీని  అప్లోడ్ చేయాలనే రూల్స్ ని కూడా తీసుకురాబోతున్నారట. దీంతో అమెరికాలో విదేశీయులు రాకను తగ్గించే విధంగా ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ట్రైల్ చేసేందుకు సిద్ధమయ్యింది అగ్రరాజ్యం.



బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ లాంటి దేశాల నుంచి వచ్చి విదేశీయులు కచ్చితంగా ఐదేళ్లపాటు తమ సోషల్ మీడియా అకౌంట్ హిస్టరీను సమర్పించాల్సి ఉంటుంది. వీటిని సమర్పించడానికి 60 రోజులపాటు సమయాన్ని కూడా ఇచ్చారు. యూఎస్ వీసా ఫ్రీ దేశాల నుంచి టూరిస్టులు .. ESTA ద్వారా అప్లై చేసుకోవచ్చని ఇది 90 రోజులపాటు అమెరికాలో పర్యటించవచ్చు. వీటికి కూడా సోషల్ మీడియా హిస్టరీ తప్పనిసరిగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినిపించడంతో ఆయా దేశాల పర్యటకుల సైతం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సుంకాల విషయంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.. ఒకవేళ సుప్రీంకోర్టు టారిఫ్ లకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే అది అమెరికాకే పెద్ద ప్రమాదం అవుతుందంటూ మాట్లాడారు. సుంకాల వల్ల వందల విలియం డాలర్లు వచ్చాయని, వీటివల్లే భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు అమెరికాలో చూడవచ్చు అంటూ తెలిపారు. మరి సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందంటూ ట్రంప్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: