పవన్ కల్యాణ్ స్పందించిన తీరు సంచలనం సృష్టించింది: సభ ముగిసేలోగా ఆ రోడ్డును మంజూరు చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు! గత వారం అంధ మహిళా క్రికెటర్ కూడా తన గ్రామానికి ఇలాగే రోడ్డు సౌకర్యం కావాలని అడిగారు. పవన్ వెంటనే ఆ రోడ్డును మంజూరు చేశారు. ఇవన్నీ మీడియా దృష్టికి వచ్చిన సంఘటనలే. కానీ, పబ్లిసిటీ వరకు రాని శరవేగ నిర్ణయాలు ఇంకా చాలా ఉన్నాయని సమాచారం. 'పజిల్' అయిన ప్రభుత్వ ప్రాసెస్‌ను ఛేదించిన పవన్! సాధారణంగా ప్రభుత్వంలో ఒక అభివృద్ధి పని మంజూరు కావాలంటే... అది చాలా మంది అధికారులు, అనేక దశల పరిశీలనలు, ప్రతిపాదనల తర్వాతే ఆమోదం పొందుతుంది. ఈ 'పెద్ద పజిల్' లాంటి ప్రాసెస్ ఆలస్యంపై ఇటీవల ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం అసహనం వ్యక్తం చేశారు.
"రాజ్యాంగాన్నే మార్చుకుంటున్నప్పుడు కొన్ని పనికి మాలిన, అడ్డగోలు నిబంధనలను ఎందుకు మార్చుకోకూడదని" ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు అలాంటి రూల్స్ అన్నింటినీ అధిగమిస్తూ... పవన్ కల్యాణ్ మంత్రిత్వ శాఖ బుల్లెట్ ట్రైన్ వేగంతో నిర్ణయాలు తీసుకుంటోంది. ఫలితంగా, అనేక మంది పౌరులకు తక్షణమే మేలు జరుగుతోంది. వ్యక్తిగత సాయాలు సైతం అంతే వేగంతో పూర్తవుతున్నాయి. చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, కంప్యూటర్లు కానీ, అంధ క్రికెటర్లకు గృహోపకరణాలు కానీ... హామీ ఇచ్చిన గంటల్లోనే, లేదా నాలుగైదు రోజుల్లోనే అందుతున్నాయి. అయితే, ఇప్పుడు వచ్చిన జీవోలు వీలైనంత త్వరగా రోడ్లుగా మారడం, నిధులు, అధికారుల నిర్లక్ష్యం లేకుండా పనులు పూర్తి కావడమే పవన్ కల్యాణ్ మాస్ గవర్నెన్స్‌కు అసలు విలువనిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి