2025లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై క్షేత్రస్థాయిలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో పాలనాపరమైన సర్దుబాట్లకే సమయం సరిపోయినా, చివరి మూడు నెలల్లో పలువురు ఎమ్మెల్యేలు ప్రజలకు చేరువ కావడంలో, పెండింగ్ సమస్యల పరిష్కారంలో విశేషమైన చొరవ చూపారు. అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న నేత‌లు కొంద‌రు ఉన్నారు. మ‌డ‌క‌శిర ఎమ్మెల్యే ఎంఎస్‌. రాజు సామాన్య కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన ఆయన, ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటూ "పీపుల్స్ ఎమ్మెల్యే"గా గుర్తింపు పొందారు.వే మిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరుమహిళా నాయకురాలిగా నియోజకవర్గ సమస్యలపై పట్టు సాధించారు. ప్రత్యర్థుల విమర్శలను ధీటుగా ఎదుర్కొంటూనే అభివృద్ధిపై దృష్టి పెట్టారు.


వెనిగండ్ల రాము గుడివాడలో సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించడంలోనూ, నియోజకవర్గంలో పార్టీ పట్టును పెంచడంలోనూ సఫలమయ్యారు. వేగేశ్న నరేంద్ర వర్మ బాపట్లలో మౌలిక సదుపాయాల కల్పన మరియు ప్రజల సమస్యలకు తక్షణ స్పందన ఇవ్వడంలో ముందున్నారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి కూడా ప్రజలకు చేరువ కావడంలో ముందున్నారు. ముఖ్యంగా నగరం ఎదుర్కొంటున్న డ్రైనేజీ మరియు రోడ్ల సమస్యలపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ తన‌దైన శైలిలో ప్రజల్లో ఉత్సాహం నింపుతున్నారు. రాజమండ్రి సిటీ - రూరల్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తమ అనుభవంతో నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు.బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన  గ్రౌండ్ లెవల్‌లో బలమైన పట్టును ప్రదర్శిస్తున్నారు.


విశాఖ తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబు నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉంటూ ప‌ట్టును మ‌రింత పెంచుకుంటున్నారు.  2025 ద్వితీయార్థంలో ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడటానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ నిరంతరం చేస్తున్న సమీక్షలే కారణమని చెప్పాలి. ప్రతీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో "ప్రజల వద్దకు పాలన" తీసుకెళ్లాలనే నిబంధనను కఠినంగా అమలు చేయడంతో, గతంలో స్తబ్దుగా ఉన్న నేతలు కూడా ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. ఫైన‌ల్‌గా 2025లో టీడీపీ ఎమ్మెల్యేలు కేవలం అధికారానికే పరిమితం కాకుండా, ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నిస్తున్నారు. రాబోయే కాలంలో ఈ జోష్ ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: