2018 సంవత్సరం అక్టోబర్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి చెల్లిస్తూ వస్తున్నారు. కానీ గత నెల మే 23వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గెలిచి ఏర్పడిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పథకం మీద ఆసక్తి చూపకపోవడంతో ఈ పథకం అమలు ఆంధ్రప్రదేష్ రాష్ట్రంలో కొనసాగే అవకాశం లేదని తెలుస్తోంది. జూన్ నెల ప్రారంభమై ఇరవై రోజులు గడిచినా ఇప్పటిదాకా ఏ ఒక్కరి అకౌంట్లో కూడా భృతి జమ కాలేదు. 
 
కానీ ఇదే నిరుద్యోగ భృతి పథకాన్ని రాజస్థాన్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి యువ సంబా యోజన అనే పథకం ద్వారా యువతులకు, దివ్యాంగులకు 3,500 రుపాయలు యువకులకు 3000 రుపాయల చొప్పున చెల్లించాలని రాజస్థాన్ కేబినేట్లో ఆమోదించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా 3016 రుపాయల నిరుద్యోగ భృతి చెల్లించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 
కానీ మన రాష్ట్రంలో మాత్రం పథకం కొనసాగే అవకాశం ఎంత మాత్రం లేదని తెలుస్తుంది. ప్రభుత్వం భారీ ఎత్తున గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు కల్పిస్తుండటంతో ఈ పథకాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. మన రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని కొనసాగించి ఉంటే బాగుండేదని యువత అభిప్రాయపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: