ఖరీఫ్ నుంచి రైతులకు పంటలపై ఉచిత భీమా ప్రభుత్వం అందిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఈ నెల 8 నుంచి నిర్వహించనున్న రైతు దినోత్సవంలో భాగంగా స్థానిక వ్యవసాయ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ "పంట రుణాలు తీసుకున్న ప్రతి రైతుకు ఉచిత భీమా వర్తిస్తుందన్నారు. పంటల భీమా పేరున బ్యాంకులకు అదనంగా డబ్బు చెల్లించవలసిన అవసరం లేదన్నారు.

రైతు చెల్లించవలసిన  2 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం" భరిస్తుందన్నారు. ప్రస్తుత సీజన్ లో జిల్లాలో వడ్డీలేని రుణాలు రూ.1510 కోట్ల వరకు ఇచ్చేందికు ప్రణాళికలు రూపొందించామని, ఇందులో భాగంగా అర్హులైన ప్రతీ రైతుకు వడ్డీలేని రుణం అందిస్తుందన్నారు. ఇప్పటికే బ్యాంకులు ఈ మేరకు ప్రక్రియలు ప్రారంభించాయన్నారు. కలుపు నివారణకు సబ్సిడీపై మందులు సరఫరా చేస్తున్నామన్నారు.

ఈ మేరకు  కలుపు నివారణ మందు కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలోనే అందుబాటులోనికి రానున్నాయని, రైతులకు హెక్టర్కు 250 గ్రాముల కలుపు నివారణ మందును అందచేస్తామన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ లో భాగంగా జిల్లాలో  ఉన్న ఎస్టీలకు 90 శాతం రాయితీపై విత్తనాలు ఇవ్వనున్నట్లు  తెలిపారు. ఈ నెల 8న రైతు దినోత్సవానికి ప్రభుత్వ ఆంక్షలకు అనువుగా నిర్వహించనున్నామన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: