సహాయం చేస్తే మనకి కూడా సహాయం తిరిగి వస్తుంది. ఈ విషయాన్ని భారతదేశం ఎప్పుడు గుర్తుంచుకుంటుంది. ఒక దేశంగా మొట్టమొదట బాధ్యత మన చుట్టుపక్కల ఇతర దేశాలకు వారి అవసరాలు సహాయం చేయడం వలన రేపు మనకి అవసరం అయినప్పుడు వాళ్లు మనకు వెన్నంటే నిలుస్తారు. ప్రపంచ దేశాలలో ఎన్నో దేశాలకి భారత దేశం వెన్నుదన్నుగా నిలుస్తూ ఉండటం అనేది ముందు నుంచి జరుగుతూ వస్తున్న విషయమే. ఏ దేశమైనా కష్టాలలో ఉంటే వారిని ఆదుకోవడంలో భారతదేశం ఎప్పుడూ ముందు ఉంటుంది. అది మందులు అందించే విషయం అయినా లేదంటే ఆహారాన్ని అందించే విషయంలో నైనా బట్టలు  విషయంలోనైనా సరే ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతూ వచ్చింది.

అమెరికా పక్కన ఉన్న బహామాస్ లో తాజాగా డోరియన్ అనే ప్రకృతి వైపరీత్యం చోటుచేసుకుంది. ఇది ఇప్పటివరకు వచ్చిన తుఫానులో కల అతి పెద్ద తుఫాను గా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పటికే యాభై మందికిపైగా మరణించినట్టు లెక్కలు. ఆ దేశంలో ఇల్లు అన్ని ఎగిరిపోతున్నాయి వాహనాలు మునిగిపోతున్నాయి మనుషులు కొట్టుకుపోతున్నారు ఎంతగానో ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవిస్తుంది దేశమంతా చిన్నాభిన్నం అయిపోతోంది. ఇలాంటి సమయంలో మేము ఆ దేశానికి సహాయం గా నిలుస్తామని భారతదేశం హామీలను అందించింది. అలాగే మాకు తోచిన సహాయం మేము చేస్తాము అని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆమెను అందించారు.

ఇది బహామాస్ లోనే కాకుండా దాని పక్కనున్న అమెరికాలోని కొన్ని ప్రదేశాలలో కూడా విజృంభన చూపించింది. ప్రకృతి వైపరీత్యాలు జరిగిన ప్రతిసారి మిగిలిన దేశాలు అన్ని ఆ దేశానికి అండగా నిలవటం అనేది ఎంతో ఆనందించదగ్గ విషయం. బావా మాస్ విషయంలోనే కాక ఇతర ఎన్నో దేశాలకు కూడా మనం ప్రకృతి వైపరీత్యాలు జరిగిన ప్రతిసారి అండగా నిలవడం జరిగింది.

భారత ప్రభుత్వం ఏకంగా ఒక మిలియన్ డాలర్లను సహాయంగా అందిస్తామని హామీ ను అందించింది. అంతేకాకుండా చేతనైన సహాయం చేసేందుకు వాలంటీర్లను కూడా భారతదేశం నుంచి బహామాస్ కు తరలించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: