టీడీపి అధినేత చంద్రబాబునాయుడు మొన్న జరిగిన ఎన్నికల అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా సహా వివిధ దేశాలకు వెళ్లి సేద తీరారు. అమెరికాలో చంద్రబాబు భార్యతో నడుస్తున్న ఓ ఫొటోను తాజాగా ఆయన కుమారుడు లోకేష్ ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ విషయం ఏంటంటే ఈ రోజు చంద్రబాబు, భువనేశ్వరి పెళ్ళి రోజు.



ఈ మేరకు ట్విట్టర్ లో తన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరిల ఫోటోను షేర్ చేసి వారికి లోకేష్ పెళ్ళి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.ఉమ్మడి ఏపీ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు అప్పటి ప్రతిపక్ష నేత ఎన్ టీ ఆర్ తన కుమార్తె నిచ్చి వివాహం జరిపించారు.



వారిద్దరి పెళ్లి రోజు ఈరోజు, అందుకే చంద్రబాబు ఇటీవల అమెరికా పర్యటనలో సరదాగా గడిపిన ఒక ఫోటోను లోకేష్ సేకరించి ట్వీట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఎందుకంటే ఎప్పుడూ సీరియస్ గా ఉండే మరియు టిడిపి అధినేత అయిన చంద్రబాబు తన భార్యపై చేయి వేసి నవ్వుతూ నడుస్తూ ఉండగా భువనేశ్వరి నల్ల కళ్ళద్దాలు, జీన్స్, టీ షర్ట్ ధరించి చాలా పాష్ గా దర్శనం ఇచ్చారు. ఎప్పుడూ ఇలా కనిపించని చంద్రబాబు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: