దసరా వచ్చేస్తుంది.ఎప్పుడొస్తుంది.ఇంకా పద్దెనిమిది రోజులుంది.అబ్బా పద్దెనిమిది రోజులాగితే ఏంచక్కాసెలవులోస్తాయి.అందరం కలసి హ్యాపీగా ఊరెళ్లి రావచ్చూ అని పిల్లలందరు ఇప్పటికే స్కూల్లో ముచ్చటించుకుంటున్నారు.సంవత్సరంలో సందడి,సందడిగా వుండే పట్నం మొత్తం ప్రశాంతంగా కనిపించేది అప్పుడే రోడ్లన్ని నిర్మానుష్యంగా ట్రాఫిక్ లేకుండా బోసిపోతుంది ఆసమయంలో.ఇక అప్పుడే ఏపి ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది.ముందుగా ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులను ఖరారు చేసిన విషయాన్ని తెలుసుకుంటే.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలకు సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు ఇవ్వనున్నారు.సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 9 వరకు విజయ దశమి సెలవులుగా పరిగణించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.అక్టోబరు 10 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి.



ఈ సెలవు రోజుల్లో తరగతులు నడిపే విద్యాసంస్థలపై తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఏపి ప్రభుత్వం హెచ్చరించింది.ఇదిలా వుండగా దసరా సెలవులను అక్టోబరు 13 వరకు పొడిగించాలని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.ఎందుకంటే అక్టోబరు 10,11 తేదీలను కూడా సెలవు దినాలుగా ప్రకటిస్తే,అక్టోబరు 12 రెండో శనివారం కాగా అక్టోబరు 13 ఆదివారం వస్తుంది కావున ఈ రెండురోజుల సెలవులు కూడా కలసివస్తాయని,తిరిగి అక్టోబరు 14న పాఠశాలలు తెరచుకుంటాయని వారు కోరుతున్నాయి..ఇక వీరి అభ్యర్థనపై ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది.ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే అక్టోబరు 13 వరకు సెలవులు కొనసాగే అవకాశం ఉందని ఆశపడుతున్నారు.ఇక మరోవైపు తెలంగాణలోని విద్యాసంస్థలకు కూడా దసరా సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది.



దీనిప్రకారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.దీంతో 16 రోజుల పాటు దసరా సెలవులు వర్తించనున్నాయి.సెలవుల అనంతరం అక్టోబర్ 14న పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయని తెలిపారు ఇక ఈ సెలవు రోజుల్లో తరగతులు నడిపే విద్యాసంస్థలపై తప్పకుండ చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది.ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేటు జూనియర్ కళాశాలలకు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 9 వరకు సెలవులు ఇవ్వనున్నట్లు,తిరిగి అక్టోబరు 10 న కళాశాలలు తెరచుకోనున్నాయని,ఇంటర్ బోర్డు వర్గాలు వెల్లడించాయి.ఇతర విద్యాసంస్థలకు కూడా ఇవే సెలవు దినాలు వర్తించనున్నాయి.ఇదండి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మంజూరు చేసిన సెలవులు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: