వాహనదారులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. దేశంలో ఇంధన ధరలు మళ్ళీ తగ్గాయి. మొన్నటి వరుకు వరుసగా 6 రోజులు తగ్గిన పెట్రోల్, డీజల్ ధరలు నిన్న తగ్గకపోయిన అదే రేటుతో కొనసాగాయి. అయితే ఈరోజు మళ్ళి పెట్రోల్, డీజల్ ధరలు అలాగే కొనసాగాయి. కాగా గురువారం పెట్రోల్ 5 పైసలు, డీజిల్ ధర 6 పైసలు చొప్పున తగ్గింది. 

       

దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.78.20కు తగ్గింది. డీజిల్ ధర రూ.72.79కు క్షీణించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 5 పైసలు తగ్గుదలతో రూ.77.80కు వద్ద, డీజిల్‌ ధర 6 పైసలు క్షీణతతో రూ.71.71 కు చేరింది. 

        

ఇక విజయవాడలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 6 పైసలు తగ్గుదలతో రూ.77.43కు క్షిణించగా, డీజిల్ ధర కూడా 6 పైసలు క్షీణతతో రూ.71.71కు చేరింది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. కాబట్టి రేపు కూడా పెట్రోల్, డీజల్ ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి పెట్రోల్ డీజిలు రేపు ఎంత మాత్రం తగ్గుతాయి అనేది చూడాలి. కాగా దేశంలోనే అతి తక్కువ ధరతో పెట్రోల్, డీజిల్ ధరలు కొనసాగుతున్నాయి. అది ఎక్కడో కాదు ఢిల్లీ మార్కెట్ లో పెట్రోల్, డీజల్ ధరలు అతి తక్కువ ధరలో తగ్గాయి. పెట్రోల్ ధర రూ.73.59 వద్ద, డీజిల్ ధర రూ.66.81 వద్ద నిలకడగా కొనసాగుతుంది.

              

మరింత సమాచారం తెలుసుకోండి: