మొన్నటికి మొన్న అసెంబ్లీ లో కనిపించిన నాయకత్వ లేమి, ఇవ్వాళ షర్మిల యాత్రకు బ్రేకులు వేసిన తెలంగాణా సెగ , 'రేపు' వస్తామన్న కొందరు తెలంగాణా ఎం.పీ లు, ఇష్టాలాపంగా బాలినేని మాటలు,అంతర్గత కుమ్ములాటలు వెరసి జగన్ పార్టీకి అసలయిన సవాళ్ళు ఇప్పుడు మొదలయ్యాయి. పుండు మీద కారంలగా మళ్లి జగన్ కి కోర్టు బైలు నిరాకరించింది, తనకు బెయిల్ మంజూరు చేయాలని పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. సుప్రీంకోర్టు సూచన మేరకు ఏడు అంశాలపైనా విచారణ జరుగుతోందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని సీబీఐ పేర్కొంది, ఈ వాదలనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల వరకు జగన్ బెయిల్ పిటిషన్ ఏ కోర్టులోనూ వేయకూడని సుప్రీం సూచించిన విషయాన్ని సీబీఐ తరఫు న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. జగన్ బయటకు వస్తే తప్పితే 'తత్కాల్' లో వచ్చిన శ్రేణులకు ఊపు రాదు, రాని జగన్ కోసం వాళ్ళు ఇంకెన్నాళ్ళు వేచి ఉంటారో! 

మరింత సమాచారం తెలుసుకోండి: