తెలుగుదేశం పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. సిట్టింగ్ జెడ్పీ చైర్మ‌న్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి ప్ర‌తిప‌క్ష వైసీపీలో చేరారు. రాజధాని ప్రాంతంలో ఈ ఎపిసోడ్ చోటుచేసుకోవ‌డం సంచ‌లనంగా మారింది. పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఉన్న ప‌రిస్థితుల‌కు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని అటున్నారు.


వైఎస్‌ఆర్‌సీసీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో గుంటూరు  జడ్పీ ఛైర్మన్‌  జానీమూన్ వైఎస్‌ఆర్‌సీపీలోకి చేరారు. ఆమెకు వైఎస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.జానీమూన్‌తో పాటు జిల్లాకు చెందిన వివిధ పార్టీల నేతలు వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలోకి చేరారు.


కేబినెట్ హోదాలో ఉన్న మంత్రి రావెల కిశోర్  బాబుపై విమ‌ర్శ‌లు చేయ‌డం ద్వారా గుంటూరు జడ్పీ చైర్ ప‌ర్సన్ జానీమూన్ వార్త‌ల్లోకి ఎక్కారు.  మంత్రి రావెల కిశోర్ వల్ల  త‌న‌కు,త‌న‌ భర్తకు ప్రాణహాని ఉంద‌ని   జానీమూన్ ఆరోపించారు. మంత్రి రావెల‌ అనుచ‌ర‌గణం రంజాన్ స‌మ‌యంలో త‌మ  ఇంటికి కత్తులతో వచ్చి పలు మార్లు బెదిరించారని జానీమూన్ వాపోయింది.  జిల్లాలో మరియు  త‌న మండలంలో తాను ఏ పని చేసినా దానిని అడ్డుకుంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జిల్లా ఎస్పీ కలిసి త‌న‌కు అద‌న‌పు ర‌క్ష‌ణ  కావాలని కోరిన‌ట్లు జడ్పీ చైర్ ప‌ర్సన్ జానీమూన్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: