హైదరాబాద్: ఓ వైపు రాష్ర్ట నాయకత్వ మార్పుపై మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు రాష్ర్ట విభజన పై కూడా అంతేస్థాయిలో ప్రచారం జరుగుతోంది. రాష్ర్ట విభజనకు కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైందనీ టీఆర్ఎస్ చెబుతోంది. ఈ క్రమంలో మార్పుపై జరుగుతున్న ప్రచారంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. విభజన తథ్యమనీ టీఆర్ఎస్ గట్టీ ధీమాతో ఉండగా...మార్పులు ఉంటాయే తప్ప విభజన ఉండకపోవచ్చనీ సీమాంధ్ర నేతలంటున్నారు. ప్రస్తుతం విభజననా? మార్పా? అనేది దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇదంతా కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది పెద్దలు ఢిల్లీ కేంద్రంగా ఆడిస్తున్న నాటకమనీ అంటున్న వారు ఉన్నారు. ఇదిలా ఉంటే, పీసీసీ చీఫ్ హస్తినలో ఉండగానే ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. రాష్ర్ట నాయకత్వ మార్పుతో పాటు రాష్ర్ట విభజనపై కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందంటూ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఏఐసీసీ మాత్రం రాష్ర్టంలో నాయకత్వ మార్పు ఉండదనీ అంటోంది. మార్పు లీకుల్ని కాంగ్రెస్ నేతలే చేయిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వారంలోనే తెలంగాణ రాష్ర్టానికి సంబంధించిన కీలకమైన ప్రకటన వెలువడటం ఖాయమనే ధీమాలో తెరాస వుంది. మరో వైపు కాంగ్రెస్ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ను మార్చడత తథ్యమనీ ప్రచారం జరగుతోంది. రాష్ట్రంలో మార్పులతో పాటు కేంద్రంలో కేబినెట్ప పనర్ వ్యవస్థీకరణ కూడా జరుగుతుందనే ప్రచారం వుంది. సీఎం కిరణ్ స్థానంలో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని తీసుకువస్తారనేది ప్రధాన ప్రచారం. సీఎం కిరాణ్కు కేంద్రంలో అవకాశం కలిపిస్తారనీ, పీసీసీ చీఫ్ బొత్సను కూడా మార్చడం ఖాయమై పోయినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సీఎం కిరణ్ స్థానంలో జైపాల్ రెడ్డిని సీఎంగా చేస్తారనీ ప్రచారం చేస్తున్న వారే...సీఎంగా జైపాల్ రెడ్డి రావడానికి ఇష్టపడటం లేదనీ అంటున్నారు. సీఎం అభ్యర్థిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి కె.జానారెడ్డి పేరును సూచించే అవకాశాలున్నాయనీ వారంటున్నారు. ఇవన్నింటికీ కాంగ్రెస్ లోకి కొందరు పెద్దలు మీడియాకు కావాలనీ లీకులు ఇస్తున్నారే తప్ప వాస్తవానికి ఢిల్లీలో ఆదిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదనీ రాష్ర్టానికి చెందిన కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పుపై ప్రచారం జరగుతుంటే...టీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ర్టానికి ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందనీ, ఇక ప్రకటన వెలువడటమే తరువాయి అంటోంది. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారు. ఊహాగానాలతో అసలు ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు అయోమయానికి గురౌతున్నారు. ఆశావాదులు మాత్రం నాయకత్వాన్ని మార్చినా, రాష్ర్ట విభజన జరిగిన తమకు పదోన్నతులు దక్కడం తథ్యమనే ధీమాతో ఉన్నారు. రాష్ర్ట నాయకత్వ మార్పుపై జోరుగా మీడియాలో వార్తలొస్తున్నా...ఢిల్లీలో పుకార్లు షికార్లు చేస్తున్నా.... 2014వరకు తానే సీఎంగా ఉంటాననీ కిరణ్ అంటుడటం కొసమెరుపు.     

మరింత సమాచారం తెలుసుకోండి: