ప్రతి ఒక్కరికీ చేసే పనిలో విజయం కావాలి. కానీ ఆ విజయానికి తగిన శ్రమ చేయాలని మాత్రం చాలామంది భావించరు. కష్టపడకుండానే విజయం సొంతం కావాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరికొంతమంది తమను ఏదో ఒకలా అదృష్టం వరిస్తుందని తాము విజయం సాధిస్తామని నమ్ముతూ ఉంటారు. కానీ చివరకు ఎవరైతే శ్రమిస్తారో వారికి మాత్రమే విజయం లభిస్తుంది. ఊహల పల్లకిలో విజయం కోసం కలలు కనేవారికి ఓటమే సొంతమవుతుంది. 
 
ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సాధన తప్పనిసరి. మారుతున్న పోటీ ప్రపంచంలో పోటీ పరీక్షల్లో పోటీ అంతకంతకూ పెరుగుతోంది. అర మార్కు, ఒక మార్కు తక్కువ రావడం వల్ల ఉన్నత ఉద్యోగాలను కోల్పోతున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. పరీక్షల్లో విజయం సాధించాలని రోజుకు 16 నుంచి 18 గంటలు చదువుతూ లక్ష్యం కోసం కృషి చేసే వారు ఉన్నారు. మరోవైపు చిన్న ఉద్యోగాలకు కూడా లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. 
 
ఎంతో ప్రతిభ, శ్రమ ఉంటే మాత్రమే ప్రస్తుత కాలంలో విజయం సాధించడం సాధ్యమవుతుంది. అలా కాకుండా నిర్లక్ష్యంతో, బద్ధకంతో ఏదో చదివామంటే చదివాం అనేలా పోటీ పరీక్షలకు సిద్ధమైతే విజయం ఎప్పటికీ సొంతం కాదు. సాధన లేకుండా విజయాన్ని పొందాలనుకోవడం.... ఎండమావిలో నీటికై ఆశించడమే అవుతుంది. ఎండ మావిలో నీరు దొరకనట్లే సాధన చేయని వారికి విజయం లభించదు. 
 
పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని అనుకోవడంలో తప్పు లేదు కానీ ఆ మంచి మార్కుల కోసం ప్రణాళికాబద్ధంగా తొలి రోజు నుంచి కృషి చేయాలి. ప్రణాళికాబద్దంగా చదువుతూ అప్పటికే విజయం సాధించిన వారి సలహాలు, సూచనలు స్వీకరించాలి. చివరి నిమిషం వరకు కష్టపడితే ఆ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. అలా కష్టపడిన వారికి జీవితంలో విజయం తప్పక సొంతమవుతుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: