ఈరోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం క్రికెట్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది, అయితే ఈ ఐపీఎల్లో ఇది ఇది 50వ మ్యాచ్. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ కు వచ్చింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లను తక్కువ పరుగులకే పెవిలియన్ పంపించి ఢిల్లీ బౌలర్లు ఆ జట్టుకు షాక్ ఇచ్చారు. చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 13 పరుగులు చేయగా మరో ఓపెనర్ డుప్లెసిస్ 10 పరుగులకే ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో చెన్నై తరఫున అరంగేట్రం చేసిన రాబిన్ ఊతప్ప 19 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కూడా ఐదు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే యూఏఈ వేదికగా జరిగిన మ్యాచ్ లో అంతగా ఆకట్టుకొని అంబటి రాయుడు ఈ మ్యాచ్ లో అదరగొట్టాడు. 43 బంతులు 55 పరుగులతో అర్థ శతకం చేసి చివరి వరకు నాటౌట్ గా నిలిచాడు. ఇక చెన్నై కెప్టెన్ ధోనీ మాత్రం 27 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టగా అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్ట్జే,  రవిచంద్రన్ అశ్విన్ పేక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే రిషబ్ పంత్ జట్టుకు 137 పరుగులు కావాలి. అయితే ఇది చిన్న లక్ష్యమే అయినప్పటికీ ధోని బౌలర్ల ఎదుర్కొని ఈ టార్గెట్ చేయించడం కొంత కష్టమే. ఒకవేళ ఈ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ చేరిస్తే ఐపీఎల్ సీజన్ లో ని పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: