ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రతి జట్టుకు ప్రతి మ్యాచ్ చాలా కీలకం. ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలని ప్రతి జట్టు ప్రయత్నిస్తుంది. అందుకోసం ప్రతి మ్యాచ్లో విజయం సాధించాలని చూస్తుంది. అయితే కొన్ని అంపైర్ తప్పుడు నిర్ణయాల కారణంగా మ్యాచ్లు ఫలితం మారిపోతుంది. అలా గత ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పంజాబ్ కింగ్స్ జరిగింది. అయితే ప్లే ఆఫ్స్ కోసమే ప్రతి మ్యాచ్ ఇంత కీలకమైన... ప్లే ఆప్స్ మ్యాచ్ లో అంపైర్ తీసుకునే నిర్ణయాలు ఇంకా చాలా కీలకంగా మారుతాయి. అయితే నిన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ తో పోటీ పడింది. అయితే ఈ మ్యాచ్ లో అంపైర్ కోహ్లీ సహనానికి పరీక్ష పెట్టాడు.

నిన్నటి మ్యాచ్ ఫీల్డ్ అంపైర్ లలో వీరేందర్ కుమార్ శర్మ ఒకరు. అయితే ఈ మ్యాచ్లో ఆయన 3 తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ మూడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు నష్టం కలిగించేవే. అయితే మొదట బెంగళూరు జట్టు బ్యాటింగ్ సమయంలో షెబాజ్ అహ్మద్ ను ఎల్బీగా అవుట్ ఇచ్చాడు. కానీ బాల్ బ్యాట్ కు తగిలిందని అహ్మద్ రివ్యూ తీసుకోవడంతో తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. రివ్యూలో బాల్ బ్యాట్ కు తగిలినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అనంతరం హర్ష పటేల్ ను కూడా ఇదేవిధంగా ప్రకటించాడు. దాంతో అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హర్షల్ పటేల్ రివ్యూకి వెళ్లగా నాట్ అవుట్ అని వచ్చింది. ఇక బెంగళూరు జట్టు బౌలింగ్ చేస్తున్న సమయంలో లో యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్లో రాహుల్ త్రిపాఠి వికెట్ల ముందు దొరికిపోయాడు. కానీ దానిని అంపైర్ వీరేంద్ర శర్మ నాటౌట్ గా ప్రకటించాడు. దాంతో బెంగళూరు ఆటగాళ్లందరూ నిరుత్సాహపడ్డారు. కానీ కెప్టెన్ కోహ్లి ఒక్కడే ధైర్యంగా రివ్యూ కోసం ముందుకు వెళ్ళాడు. అక్కడ కూడా అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాహుల్ త్రిపాఠి ఔట్ అని వచ్చింది. దాంతో కోహ్లీ అతనిపై అసహనం వ్యక్తం చేశాడు. ఇక నెట్టింట్లో కూడా అభిమానులు ఈ అంపైర్ కేకేఆర్ కి అమ్ముడుపోయారని... అతను కేకేఆర్ జట్టుకు ఫెవర్ గానిర్ణయాలు తీసుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: