భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ కు సాధ్యం కాని విధంగా ఇండియన్ టీం కి రెండు ప్రపంచ కప్ లు అందించిన ఘనత కేవలం ధోని కి మాత్రమే సాధ్యం అయింది అని చెప్పాలి.  అంతే కాదు ఎంతో ఒత్తిడిలో కూడా ఎంతో కూల్గా కనిపిస్తూ ఎలాంటి హావభావాలు బయటకి చూపించకుండా  మ్యాచ్ ను తన వైపు తిప్పుకోవడం లో ధోని ఎంతో సమర్ధుడు అని చెప్పాలి. ఇక ఎన్నో ఏళ్ళ పాటు భారత జట్టు సారథిగా  కొనసాగిన మహేంద్రసింగ్ ధోని ఆ తర్వాత తన అంతర్జాతీయ  కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఇప్పుడు బిసిసిఐ నిర్వహించే దేశవాళీ క్రికెట్ లీగ్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.



 అయితే ధోనీ కెప్టెన్గా తప్పుకున్న తర్వాత టీమిండియాకు మరోసారి వరల్డ్ కప్ అందని ద్రాక్షలా మారిపోయింది. కోహ్లీ కెప్టెన్సీలో పలుమార్లు టీమిండియా వరల్డ్ కప్ ఆడినప్పటికీ ప్రతిసారి తడబడుతూనే ఉంది. అయితే మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఈ సారి మాత్రం తప్పకుండా వరల్డ్ కప్ గెలవాలని బిసిసిఐ భావిస్తుంది. ఈ క్రమంలోనే కోహ్లీ కెప్టెన్సీలో వరల్డ్ కప్ ఆడబోయే జట్టుకు ధోనిని మెంటార్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఇక ధోని ఆధ్వర్యంలో అటు టీమిండియా వరల్డ్ కప్ ఆడబోతు ఉండడంతో  భారీగానే అంచనాలు నెలకొన్నాయి.  అయితే ఇలా మెంటార్ వ్యవహరించేందుకు అటు ధోని భారీగానే పారితోషికం తీసుకుంటున్నాడు అంటూ ఒక టాక్ వినిపించింది.



 కానీ ఇటీవలే అసలు విషయాన్ని బయటపెట్టాడు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియాకు మార్గనిర్దేశకుడిగా నియమించబడిన మహేంద్రసింగ్ ధోని దీనికోసం బిసిసిఐ నుంచి ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదట. ఉచితంగానే మెంటార్ బాధ్యతలను నిర్వహించేందుకు ధోని ముందుకొచ్చాడు అంటూ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. టి20 వరల్డ్ కప్ కోసం ఇప్పటికే బిసిసిఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అంతే కాదు ధోనీ మెంటార్ గా వ్యవహరించబోతున్నాడు అనే విషయాన్ని కూడా ప్రకటించింది.  కాగా అటు టీ20 క్రికెట్ లో ఐపీఎల్లో సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు మహేంద్రసింగ్ ధోని.

మరింత సమాచారం తెలుసుకోండి: