యూఏఈ మరియు ఒమన్ లు వేదికలుగా టీ 20 వరల్డ్ కప్ 2021 ఎంతో సక్సెస్ ఫుల్ గా జరుగుతోంది. ఈ రోజు అటు భారత్ మరియు న్యూజిలాండ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ అని చెప్పాలి. రెండు జట్లు కూడా తాము ఆడిన మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ తో ఓడిపోయాయి. దీనితో తర్వాత జరగబోయే మ్యాచ్ లన్నీ గెలవాల్సిన కఠిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకే మాత్రమే సెమీఫైనల్ అవకాశాలు మెరుగుపడుతాయి. ఒకవేళ ఓడితే మాత్రం సెమీస్ కు చేరడం చాలా కష్టం. ఈ సందర్భంలో రెండు జట్లు మంచి టీం తో బరిలోకి దిగడానికి ప్లాన్ చేస్తున్నాయి. న్యూజిలాండ్ దాదాపుగా మార్పులు లేకుండా బరిలోకి దిగవచ్చు.

కానీ ఇండియా విషయానికి వస్తే జట్టులో కొన్ని కీలక మార్పులు చేయనున్నారని సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని బట్టి అర్ధమవుతోంది. గత మ్యాచ్ లో ఓటమి పలు కావడంతో ఇండియాపై అన్ని వైపులా నుండి తీవ్ర ఒత్తిడి ఉంది. అందుకే ఉత్తమమైన జట్టును న్యూజిలాండ్ తో ఢీ కొట్టడానికి సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి జట్టు ఏ విధంగా ఉండనుందోన ఒకసారి చూద్దాం. ఒక జట్టు టీ 20 మ్యాచ్ లో గెలవడానికి కొన్ని కీలక అంశాలు దోహదపడుతాయి.

ఒకవేళ టీమ్ మొదట బ్యాటింగ్ చేస్తే మొదటి ఆరు ఓవర్లు వికెట్ కోల్పోకుండా మంచి రన్ రేట్ ను కలిగి ఉండాలి. ఆ తర్వాత అటాక్ చేసి వీలైనన్ని పరుగులు చేయడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఓపెనర్లుగా మంచి రికార్డు ఉన్న రోహిత్ మరియు రాహుల్ నే కొనసాగించనున్నారు. కోహ్లీ, పంత్ లు గత మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ రోజు అదే తరహా ఇన్నింగ్స్ ను వారి నుండి ఆశించవచ్చు. ఇక పాక్ తో మ్యాచ్ లో 4 వ స్థానంలో బ్యాటింగ్ చేసిన సూర్య కుమార్ యాదవ్ వేగంగా పరుగులు చేస్తున్నా వికెట్ కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి. కాబట్టి సూర్య కుమార్ యాదవ్ కు మరో ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఇక జట్టు విజయానికి కీలకమయిన ఆల్ రౌండర్ విషయంలో చర్చ జరుగుతోంది. హార్దిక్ పాండ్య గత మ్యాచ్ లో విఫలం అవ్వడం మరియు బౌలింగ్ కూడా చేయకపోవడంతో ఇషాన్ కిషన్ ను తీసుకోవాలని విమర్శలు వస్తున్నాయి. అయితే జట్టు యాజమాన్యం హార్దిక్ నే కొనసాగించనుంది, కాగా జడేజా స్థానానికి ఎటువంటి ఢోకా ఉండదు. బౌలింగ్ లో అంత ఫిట్ గా లేని భువిని తప్పించి శార్దూల్ ఠాకూర్ ను తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్పిన్నర్ గా రాహుల్ చాహర్ కు మరో అవకాశం ఇవ్వొచ్చు. మరి ఇంకేమైనా మార్పులు ఉన్నాయా అన్నది మ్యాచ్ సమయానికి కానీ తెలిసే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: