భారత్లో క్రికెట్ ఆట కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ కూడా క్రికెట్ చూడడానికే కాదు ఆడటానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోయి మరి మ్యాచ్ వీక్షించే ప్రేక్షకులు కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు మైదానంలో క్రికెట్ ఆడటానికి  ఎంతగానో ఆసక్తి చూపుతుంటారు. అయితే సాధారణంగా అటు అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించడం లాంటివి చూస్తూ ఉండటం చూసాం. కొంత మంది ఆటగాళ్లు ఎక్కువ పరుగులు చేసి  ప్రపంచ రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటారు.


 అయితే కేవలం అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రమే కాదు అటు గల్లీ క్రికెట్ లో కూడా ఎంతోమంది టాలెంట్ వున్న ఆటగాళ్లు ఉంటారు. ఇక గల్లీ క్రికెటర్లు కూడా ఒక రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసి కొన్ని కొన్ని సార్లు ఆశ్చర్యపరుస్తూ ఉండటం లాంటివి కూడా చూస్తూ ఉంటామ్. ఇలా గల్లీ క్రికెటర్లు అరుదైన రికార్డులు సాధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక వీడియోనే వైరల్ గా మారిపోయింది. ఇక్కడ ఒక బుడ్డోడు సాధించిన రికార్డు అటు అంతర్జాతీయ క్రికెట్లో కూడాఎవరు సాధించి ఉండకపోవచ్చు అని చెప్పాలి.


 అంతలా తన ప్రతిభతో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు ఇక్కడొక బుడ్డోడు. ఢిల్లీలో జరిగిన అండర్ 14 టోర్నీ డ్రీం చేంజర్ కప్లో ఢిల్లీకి చెందిన 13 ఏళ్ల మెహెక్ కుమార్ చెలరేగి పోయాడు. బౌలర్లు అందరి తో ఒక ఆట ఆడుకున్నాడు అని చెప్పాలి. బోనాలకు చుక్కలు చూపిస్తూ ఏకంగా మూడు  331 పరుగులు చేశాడు.అది కూడా కేవలం 125 బంతుల్లోనే.. అయితే ఇక ఈ పరుగులలో ఏకంగా 30 సిక్సర్లు, 28 ఫోర్లు ఉండడం గమనార్హం. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ విధ్వంసానికి అందరూ ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇక ఈ వివరాలను వెల్లడించింది

మరింత సమాచారం తెలుసుకోండి: