సన్రైజర్స్ హైదరాబాద్ ఇక ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తే ఈ ఏడాది ప్లే ఆఫ్ లో అడుగు పెట్టకుండానే ఇంటి దారి పట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మొదట్లో వరుస పరాజయాల తర్వాత అనూహ్యంగా పుంజుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. వరుసగా ఐదు విజయాలు సాధించి ప్రేక్షకులందరిలో కూడా కొత్త ఆశలు చిగురించేలా చేస్తుంది. కానీ ఆ తర్వాత మాత్రం మళ్లీ పేలవ ప్రదర్శన బాట పట్టింది. వరుసగా ఓటమిని చవి చూస్తుంది.  ఐదు విజయాల తర్వాత ఐదు పరాజయాలు మూటగట్టుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.


 దీంతో మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గత రెండు మ్యాచ్లలో బెంగళూరు చేతిలో 67 పరుగులు, కోల్కతా చేతిలో 54 పరుగుల తేడాతో ఓడింది ఇక ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపు మూసుకుపోయేలా చేసుకుంది సన్రైజర్స్ హైదరాబాద్. చివరి రెండు మ్యాచ్ లలో భారీ విజయాలు సాధిస్తే తప్ప ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండవు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే అది సాధ్యమయ్యే పనికాదు అని చెప్పాలి. కాగా నేడు ముంబై ఇండియన్స్ తో పోరుకు సిద్ధమైంది.


 ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ లీసా  స్థాలెకర్ స్పందించింది.. ఈ ఎడిషన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మిగిలిన రెండు మ్యాచ్లు కూడా గెలవడం కష్టం అంటూ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రయాణం ఏడాది ఐపీఎల్లో ముగిసిపోయినట్లే అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇటీవలే క్రిక్ బజ్ తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా చివరి రెండు మ్యాచ్లలో సన్రైజర్స్ కేవలం 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన చేధనకు  దిగిన ఇలాంటి రన్స్ మాత్రం ఏ మాత్రం సరిపోవు. కెప్టెన్ విలియమ్సన్ తన స్థాయికి తగ్గట్టుగా రాణించడం లేదు అంటూ చెప్పుకొచ్చారు లీసా.

మరింత సమాచారం తెలుసుకోండి: