ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్లేయర్లు సాధిస్తున్న రికార్డుల కంటే అంపైర్ల  తప్పుడు నిర్ణయాల ఎక్కువ ఉన్నాయి అని చెప్పాలి. ఒకవైపు ఫీల్డ్ అంపైర్లు మరోవైపు థర్డ్ అంపైర్లూ సైతం తప్పుడు నిర్ణయాలతో ఎంతో మంది ఆటగాళ్ల పాలిట శాపంగా మారి పోతున్నారూ అని చెప్పాలి. ఈ క్రమంలోనే అంపైర్లు చేస్తున్న ప్రజలపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో తిట్టిపోస్తున్నారు ఐపీఎల్ అభిమానులు. ఇకపోతే ఇటీవలే గుజరాత్ టైటాన్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలా తప్పుడు నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.



 ఈ ఏడాది గుజరాత్ తరఫున ఆడుతున్న వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ అనుకున్నంతగా రాణించడం లేదు. దీంతో మేనేజ్మెంట్ అతన్ని కొన్ని మ్యాచులు దూరం పెట్టింది. ఇటీవల ప్లే ఆఫ్ చేరుకున్నాక తిరిగి జట్టులో అవకాశం కల్పించింది. ఇటీవలే  బెంగళూరు జట్టుతో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో వేడ్ వికెట్ కోల్పోయిన తర్వాత  ఫ్రస్ట్రేషన్ పీక్స్ వెళ్ళింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత హెల్మెట్ ను గట్టిగా విసిరి కొట్టడం.  కుర్చీకి బ్యాట్ ను కొట్టడం చేసి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అయితే మాథ్యూ వేడ్ ఇంత అసహనం వ్యక్తం చేయడానికి వెనుక ఒక పెద్ద కారణం ఉంది అని చెప్పాలి.


 గిల్ అవుట్ అయిన తర్వాత క్రీజు లోకి వచ్చిన వేడ్ 13 బంతులు ఆడి 2 ఫోర్లు ఒక సిక్సర్ తో మంచి టచ్ లోనే కనిపించాడు.  6వ ఓవర్లో మ్యాక్స్వెల్ వేసిన బౌలింగ్లో రెండో బంతికి ఎంపైర్ అతడిని ఎల్బిడబ్ల్యు అవుట్ ఇచ్చాడు. బంతి బ్యాట్ కు తాకిందని ఉద్దేశంతో  వెంటనే రివ్యూకు వెళ్ళాడు మాథ్యూ వేడ్. ఇక రిప్లై లో బంతి బ్యాట్ కు టచ్ అవుతూ వెళ్ళినట్లు కనిపించింది. అయినప్పటికీ బంతి బ్యాట్ కు తాకుతూ వెళుతున్న విషయాన్ని లెక్కచేయని థర్డ్ అంపైర్  అల్ట్రాసౌండ్ లో స్పైక్ రాలేదు అనే కారణంతో  అవుట్ గా ప్రకటించాడు. దీంతో ఎంతో అసహనం తో పెవిలియన్ చేరాడు మాథ్యూ వేడ్. తర్వాత ఇలా హెల్మెట్ విసిరి కొట్టడం బ్యాట్ కుర్చీలకు కొట్టడం లాంటివి చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Bat