సాధారణంగా ఐపీఎల్ సీజన్ అంటేనే యువ ఆటగాళ్ల ప్రతిభకుమారు పేరుగా కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే సీనియర్ ఆటగాళ్లు ప్రదర్శనను అటు అంతర్జాతీయ క్రికెట్ లో కూడా చూస్తూనే ఉంటారు ప్రేక్షకులు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మాత్రం అప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టనీ.. ప్రేక్షకులకు తెలియని యువ ఆటగాళ్లు ఒక్కసారిగా తమ ప్రతిభతో తెరమీదికి వస్తూ ఉంటారు. తమ సత్తా ఏంటో నిరూపించుకొని అంతర్జాతీయ క్రికెట్ లో ఫ్యూచర్ స్టార్స్ మేమే అంటూ నిరూపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ సత్తా చాటారు.


 కొంతమంది తమ అద్భుతమైన బౌలింగ్ ప్రతిభతో తెర మీదికి వస్తే మరి కొంతమంది తమ  బ్యాటింగ్ నైపుణ్యంతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఇలా ఈ ఏడాది యువ ఆటగాళ్ల ప్రతిభ కు కొదవ లేకుండా పోయింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో. ఈ క్రమంలోనే లక్నో  జట్టులో రవి బిష్ణోయ్ స్పిన్నర్ గా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లక్నో జట్టు విజయంలో ప్రతి మ్యాచ్ లో కూడా కీలకపాత్ర వహిస్తూ వచ్చాడు రవి బిష్ణోయ్.  స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేస్తూ ఆటగాళ్లను తికమక పెడుతూ వికెట్లు తీసుకుంటూ వచ్చాడు. కాగా ప్లే ఆఫ్లో అవకాశం దక్కించుకున్న లక్నో జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే.


 లక్నో స్పిన్నర్ రవి బిష్ణోయ్ పై గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. రవి బిష్ణోయ్ మంచి ప్రతిభావంతుడు అతడితో నేను చాలాసార్లు మాట్లాడాను. అతడు రాబోయే రోజుల్లో టీమిండియాలో స్టార్ బౌలర్ గా ఎదుగుతాడు. ఇక రవి బిష్ణోయ్ తన ప్రతిభను మరింత మెరుగు పరుచుకుంటూ ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇక రానున్న రోజుల్లో బిష్ణోయ్కు టీమిండియాలో చోటు దక్కడం ఖాయమని పలువురు మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: