ఒకవైపు గాయాలు ఇంకోవైపు సర్జరీలు మరోవైపు పేలవ ఫామ్ అన్ని కలిపి అటు టీమిండియా అతనికి ఉద్వాసన పలికేలా చేశాయి. అయినప్పటికీ అతను మాత్రం కుంగిపోలేదు గోడకు కొట్టిన బంతిలా.. ఎగసిపడిన అలల మళ్లీ పుంజుకున్నాడు. ఒకప్పుడు ఆటగాడిగా రాణిస్తే ఇక ఇప్పుడు కెప్టెన్గా కూడా సత్తా చాటాడు. అతనెవరో కాదు గుజరాత్  కెప్టెన్ హార్దిక్ పాండ్య. ఐపీఎల్లో ప్రస్థానం మొదలుపెట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టుకి కెప్టెన్ గా అవతరించాడు హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా ఏంటి కెప్టెన్సీ చేయడమేంటి.. పిచ్చి కాకపోతే అతనికి సారథ్యం సాధ్యమవుతుందా  అని హేళన చేశారు ఎంతోమంది.


 సారథ్యం  విషయం పక్కన పెడితే కనీసం అతను బాగా రాణించగలడా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు మరి కొంతమంది. కానీ అందరి నోళ్ళు మూయిస్తూ ఒకవైపు ఆటగాడిగా మరోవైపు కెప్టెన్గా ముందుకు జట్టును నడిపించి  గుజరాత్ జట్టును మొదటి సీజన్ లోనే ఐపీఎల్ టైటిల్ విన్నర్ గా నిలిపాడు. దీంతో అతనిపై ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోసం అతను భారత జట్టులోకి సెలెక్ట్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమం లోనే ఇటీవల హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడూ. ఈ సారి ఏం జరిగినా కచ్చితం గా భారత జట్టు కోసం ప్రపంచ కప్ గెలవాలని అనుకొంటున్నాను అంటూ హార్థిక్ పాండ్య చెప్పుకొచ్చాడు. దీని కోసం తన నుంచి 100% ప్రదర్శన ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. తన జట్టు మొదటి స్థానంలో ఉండడానికి తాను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపాడూ. నేను ఎన్ని మ్యాచ్లు ఆడిన టీమిండియా తరఫున ఆడటం మాత్రం కల నిజమైనట్లుగా భావిస్తాను అంటూ హార్దిక్ పాండ్యా ఇటీవల చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: