ఈ ఏడాది ఐపీఎల్ లో ఎంతో మంది భారత యువ ఆటగాళ్లతో పాటు విదేశీ యువ ఆటగాళ్లు కూడా సత్తా చాటారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి వారిలో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన డెవల్ట్ బ్రెవిస్  కూడా ఒకరు. ముంబై ఇండియన్స్ జట్టులో ఏడు మ్యాచ్ లలో అవకాశం దక్కించుకున్న ఈ యువ క్రికెటర్ 142.48  స్ట్రైక్ రేట్ తో 161 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముంబై ఇండియన్స్ ఎంత పేలవమైన ప్రస్థానాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఐపీఎల్ లో ప్లే ఆఫ్ చేరకుండానే రేసు నుంచి నిష్క్రమించిన మొదటీ జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డు నమోదు చేసింది. ఇకపోతే ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడుతున్న సమయంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్  కలిసిన  సమయంలో  ఏం జరిగిందో అన్నది ఇటీవలే యువ క్రికెటర్ డెవల్ట్ బ్రెవిస్    గుర్తుచేసుకున్నాడు  ముంబై జట్టు తరఫున ఆడుతున్న సమయంలో ఓ రోజు తానూ జిమ్ లో నేలపై పడుకుండిపోయాను. ఆకస్మాత్తుగా ఆ సమయంలో అక్కడికి సచిన్ వచ్చాడు. ఆ క్షణం ఏం మాట్లాడాలో కూడా తనకు అర్థం కాలేదు అంటూ యువ ఆటగాడు చెప్పుకొచ్చాడు.


 ఇక మొదటి సారి సచిన్ టెండూల్కర్ తో కరచాలనం చేయడం ఎంతో అద్భుతంగా అనిపించింది అని తెలిపాడు. ఇక అతను నాకు బ్యాటింగ్ లో నేర్పించిన చిన్న టెక్నికల్ పాఠాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవె సచిన్ టెండూల్కర్ తో పాటు కోచ్ మహేళా జయవర్దనే నుంచి ఎంతో నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.  కాగా ఈ యువ ఆటగాడు అండర్-19 ప్రపంచ కప్ లో 506 పరుగులు చేసి అదరగొట్టాడు. అంతే కాదు బేబీ డివిలియర్స్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ 20  లక్షల కనీస ధర తో మెగా వేలంలో పాల్గొంటే మూడు కోట్లకు ముంబై దక్కించుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: