దక్షిణాఫ్రికాతో టీమ్ ఇండియా టి20 సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలోనే మొదటి టి20 మ్యాచ్ ఢిల్లీ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. అయితే కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని టీమిండియాతో బరిలోకి దిగాల్సి ఉన్నప్పటికీ గజ్జల్లో గాయం కారణంగా అటు కె.ఎల్.రాహుల్ జట్టుకు దూరమయ్యాడు. దీంతో ఇక వైస్ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ తక్కువ వయసులోనే కెప్టెన్ స్థాయికి ఎగబాకాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్సి చేపట్టిన అనుభవం ఉన్న రిషబ్ పంత్ ఇక ఇప్పుడు టీమిండియా కెప్టెన్ గా కూడా అవకాశం దక్కించుకోవడంతో ఎంతోమంది అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.


 ఇలా టీమ్ ఇండియా టి20 కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న రిషబ్ పంత్ ఒక అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అతి చిన్న వయసులో టి20 సారథ్య బాధ్యతలను చేపట్టిన ప్లేయర్ లిస్టు  లో రెండవ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉంది మాజీ ఆటగాడు సురేష్ రైనా కావడం కావడం గమనార్హం. ఒక ఇరవై మూడు సంవత్సరాల 197 రోజుల వయసులో సురేష్ రైనా టి20 కెప్టెన్సీ చేపట్టి అతిపిన్న వయస్కుడిగా ఉన్నాడు.


 ఇక ఇప్పటికి కూడా సురేష్ రైనా రికార్డు అలాగే పదిలంగా ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే 1997 అక్టోబర్ లో జన్మించిన రిషబ్ పంత్ 24 ఏళ్ల వయసులో కెప్టెన్సీ చేపట్టిన రెండో అతి పిన్న వయస్కుడైన కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. 2005లో టి 20 ప్రపంచకప్ లో టీం ఇండియా కెప్టెన్సి సాధించినప్పుడు  ధోనీ వయస్సు 26 సంవత్సరాలు కావడం గమనార్హం. దీంతో ధోనీ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఇదే లిస్ట్ లో వీరేంద్ర సెహ్వాగ్ 28 సంవత్సరాల వయస్సులో కెప్టెన్సి చేపట్టి నాలుగో స్థానంలో కోహ్లీ 28 సంవత్సరాల వయస్సులో కెప్టెన్సీ చేపట్టి 5వస్థానంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: