సాధారణంగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో భారత క్రికెట్ ప్లేయర్లు ఎవరైనా మెరుగైన ప్రదర్శన చేసి మంచి ర్యాంక్ సొంతం చేసుకున్నారు అంటే అభిమానులు ఆనందంలో మునిగిపోతా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఒకవేళ భారత ప్లేయర్లు టాప్ టెన్ లో చోటు సంపాదించుకుంటే అదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు భారత కెప్టెన్, వైస్ కెప్టెన్ కూడా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో సత్తా చాటారూ అనేది తెలుస్తుంది. ఇటీవలే భారత మహిళల జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది అన్న విషయం తెలిసిందే.


 లంక పర్యటనలో భాగంగా అద్భుతమైన ప్రదర్శన చేసింది. ముందుగా టి20 సిరీస్ ఆడింది భారత మహిళల జట్టు. టి-20 సిరీస్ లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించింది. ఇక ఆ తర్వాత మ్యాచ్ లో కూడా విజయం సాధించి క్లీన్స్వీప్ చేస్తుంది అనుకుంటే ఇక శ్రీలంక పుంజుకోవడంతో అది కుదరలేదు. అయితే వన్డే సిరీస్లో మాత్రం అది సాధించి సత్తా చాటింది భారత జట్టు. వన్డే సిరీస్లో మూడు మ్యాచ్లలో విజయం సాధించి శ్రీలంకను క్లీన్స్వీప్ చేసింది.


 ఇక ఈ వరుస సిరీస్లలో అటు టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మందాన కూడా మెరుగైన ప్రదర్శన చేశారు అన్న విషయం తెలిసిందే. కాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో సత్తా చాటారు. ఓపెనర్ స్మృతి మందాన 9వ స్థానానికి ఎగబాకింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 13 వ ర్యాంక్ లో నిలిచింది. శ్రీలంక ను క్లీన్ స్వీప్ చేసిన వన్డే సిరీస్లో భాగంగా హర్మన్ ప్రీత్ కౌర్ 59.51 సగటుతో  119  పరుగులు చేసింది. ఇక మూడు వికెట్లు తీసింది.


 ఓపెనర్ స్మృతి మందాన 52 సగటుతో 104 పరుగులు చేసి అదరగొట్టింది. ఈ క్రమంలోనే ఇక ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో మెరుగైనా స్థానాన్ని దక్కించుకున్నారు అన్నది తెలుస్తుంది. అటు శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డే సిరీస్లో భారత మహిళా బౌలర్ రాజేశ్వరి గైక్వాడ్ కూడా అదరగొట్టింది. ఏకంగా మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 9వ ర్యాంకు సొంతం చేసుకుంది. ఇక శ్రీలంకతో జరిగిన వన్డే లకు దూరంగా ఉన్న వెటరన్ సీమర్ ఝాలన్ గోస్వామి నిలకడగా ఆరోస్థానం లోనే కొనసాగుతూ ఉండటం గమనార్హం. తమ అభిమాన క్రికెటర్లు ర్యాంకులు మెరుగుపరచుకోవడం తో ఫ్యాన్స్ సంతోషం లో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc