ఇంగ్లాండులోని మాంచెస్టర్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత జట్టు ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో చివరి భారత జట్టు విజయం సాధించి వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది. ఇక టీమిండియా విజయం సాధించడంలో వికెట్-కీపర్ రిషబ్ పంత్ కీలక  పాత్ర వహించాడు అని చెప్పాలి. 160 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది భారత జట్టు. ఈ క్రమంలోనే 72 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది ఇండియా. ఇలాంటి సమయంలో టీమిండియా ఓడిపోవడం ఖాయమని ఇక వన్డే సిరీస్ ఇంగ్లాండ్ చేజిక్కించుకున్నట్లే అని అందరూ భావించారు. అలాంటి సమయంలోనే క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ తన ఆటతీరుతో మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం మార్చేసాడు అని చెప్పాలి.


 ముందుగా హార్దిక్ పాండ్యా తో కలిసి ఎంతో అద్భుతమైన షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టిన రిషబ్ పంత్ 133 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా అవుట్ అయినప్పటికీ తన దూకుడు మాత్రం ఎక్కడా తగ్గించకుండా  తనదైన శైలిలోనే మ్యాచ్ ముగించాడు అని చెప్పాలి. 113 బంతుల్లో 125 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లతో పాటు 16 ఫోర్లు కూడా ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే టీమిండియా గెలుపుకు కారణమైన రిషబ్ పంత్ కే మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక అవార్డు ప్రజెంటేషన్ సమయంలో రిషబ్ పంత్ కి నగదుతో పాటు షాంపైన్ బాటిల్ కూడా ఇచ్చారు నిర్వాహకులు..


 అయితే ఆటగాళ్లు ఎవరైనా సరే షాంపైన్ బాటిల్ ని భద్రంగా దాచుకుంటారు. కానీ రిషబ్ పంత్ మాత్రం ఎవరూ ఊహించని పని చేశాడు. మైదానంలో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న మాజీ కోచ్ రవిశాస్త్రికి షాంపైన్ బాటిల్ బహుమతిగా ఇచ్చాడు రిషబ్ పంత్. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. రవి శాస్త్రి హెడ్ కోచ్ గా ఉన్న సమయంలో రిషబ్ పంత్ తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. ఇక మొదట్లో పంత్ చాలాసార్లు విఫలమైనప్పటికీ రవిశాస్త్రి మాత్రం అతని మీద నమ్మకంతో వరుస అవకాశాలు ఇచ్చి మెరుగైన క్రికెటర్గా తీర్చిదిద్దాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: