ప్రస్తుతం టీమిండియా జట్టులో ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నారు హార్దిక్ పాండ్య గత కొంతకాలంగా జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా ఇటీవల ఐపీఎల్ లో సత్తా చాటి టీమిండియా లోకి ఎంట్రీ ఇచ్చాడు  అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రీ ఎంట్రీలో అదరగొడుతు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. బౌలింగ్లో బాటిల్లో తనకు తిరుగు లేదు అని నిరూపిస్తున్నాడు హార్దిక్ పాండ్యా. అయితే ప్రస్తుతం భారత జట్టులో ఉన్న అందరు ఆటగాళ్లు టీ20 వన్డే ఫార్మాట్లో తో పాటు టెస్టు ఫార్మాట్లో కూడా ఆడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కానీ స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా  మాత్రం టెస్టు ఫార్మాట్ కు పూర్తిగా దూరంగానే ఉన్నాడు.


 మరికొన్ని రోజుల్లో టెస్టు ఫార్మాట్లో ఆడటం గురించి ఆలోచిస్తాను అంటూ ఎప్పుడు అడిగినా ఒకే సమాధానం చెబుతూ వస్తున్నాడు. ఇకపోతే ఇటీవలే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పై మాజీ హెడ్ కోచ్  రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగబోతున్న వన్డే వరల్డ్ కప్ తర్వాత హార్దిక్ పాండ్యా వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి తప్పుకునే అవకాశం ఉంది అని రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు.. భవిష్యత్తులో ఎంతో మంది ఆటగాళ్లు వన్డే ఫార్మాట్ కంటే టి20 ఫార్మర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చు అంటూ అభిప్రాయపడ్డాడు.


 ఇటీవలే ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అనూహ్యంగా వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకొని అందరికీ షాకిచ్చాడు. మూడు ఫార్మాట్లలో ఆడటం తనకు చాలా కష్టంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు బెన్ స్టోక్స్. ఈ క్రమంలోనే  రవి శాస్త్రి మాట్లాడుతూ.. వన్డేలు టి20 ల కంటే టెస్ట్ చాలా ప్రత్యేకమైనది. కానీ ఇటీవల కాలంలో టెస్ట్ క్రికెట్ ఆదరణ కోల్పోతుంది. ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు వారు  ఏ ఫార్మాట్ లో ఆడాలి అన్న విషయాన్ని నిర్ణయించుకున్నారు. హార్దిక్ పాండ్యా ఎక్కువగా టీ20 క్రికెట్ ఆడాలని అనుకుంటున్నా అని ఎన్నోసార్లు బహిర్గతంగా కూడా చెప్పాడు. అతడు వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత వన్డేలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. మరి కొంత మంది ఆటగాళ్లు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చాడు రవి శాస్త్రి. రవి శాస్త్రి చెప్పిన మాటలతో అభిమానులు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: