భారత క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు అద్భుతమైన సేవలు అందించిన రాహుల్ ద్రవిడ్.. దిగ్గజ క్రికెటర్ గా ఎదిగాడు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ రాహుల్ ద్రావిడ్ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొత్తంగా 164 టెస్ట్ మ్యాచ్లలో 13288 పరుగులు చేశాడు. రాహుల్, ద్రావిడ్ వన్డేలు టెస్టులలో పదివేలకు పైగా పరుగులు చేసిన అతి కొద్దిమందిలో ఒకరిగా ఉన్నాడు అని చెప్పాలి. అయితే 1996లో ఇంగ్లండ్ పర్యటనలో ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో సౌరవ్ గంగూలీతో కలిసి అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు రాహుల్ ద్రావిడ్.


 అయితే మొదటి మ్యాచ్ లోనే ఈ ఇద్దరు క్రికెటర్లు అదరగొట్టారు అనే చెప్పాలి. ఒకవైపు సౌరవ్ గంగూలీ సెంచరీతో అదరగొట్టాడు. అదే మ్యాచ్ లో రాహుల్ ద్రవిడ్ 95 పరుగుల వద్ద ఐదు పరుగుల తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇటీవలే తన సుదీర్ఘమైన కెరీర్ గురించి మాట్లాడుతూ తన కెరీర్ ను వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సుదీర్ఘమైనది అయినప్పటికీ త్వరగా గడిచిపోయింది అని అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. తన తొలి టెస్ట్ మ్యాచ్ నిన్నే జరిగిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇక భారత్ తరఫున టెస్ట్ ఆడే అవకాశం రావడం.. నాకు ఒక గొప్ప విషయం అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.


 అయితే లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ సమయంలో సరిగ్గా టాస్ వేయడానికి పదినిమిషాల ముందు కెప్టెన్ నా దగ్గరికి వచ్చి నువ్వు ఈ మ్యాచ్లో ఆడుతున్నావ్ అంటూ చెప్పాడు.  అప్పుడు సంజయ్ మంజ్రేకర్ ఫిట్నెస్ టెస్ట్ లో ఫెయిల్ కావడంతో నాకు తుది జట్టులో అవకాశం దక్కింది. అయితే ఈ విషయం ముందే తెలిసి ఉంటే ఎలా ఉండేదో కానీ మ్యాచ్ ప్రారంభమయ్యే చివరి క్షణాల్లో తెలియడంతో భయం సంతోషం రెండూ కూడా మనసులో నిండిపోయాయి. ఇండియా తరఫున టెస్టుల్లో ఆరంగేట్రం చేయాలని నా కల నిజమైన రోజు అది ఎప్పటికీ మర్చిపోలేను అంటూ రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: