టీమిండియా క్రికెట్ కు ఎనలేని సేవలు అందించిన గొప్ప క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని. సాదా సీదా ఆటగాడి స్థాయి నుంచి ఏకంగా టీమ్ ఇండియా ను అంతర్జాతీయ క్రికెట్ లో నెంబర్ వన్ స్థానం లో నిలబెట్టిన గొప్ప కెప్టెన్ స్థాయికి ఎదిగాడు మహేంద్ర సింగ్ ధోనీ. టీమిండియాకు రెండు ప్రపంచకప్ లు అందించిన ఏకైక కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అయితే మహేంద్ర సింగ్ ధోనీ లో ప్రేక్షకులందరికీ నచ్చేది అతని ఫినిషింగ్ అని చెప్పాలి. ఎంతో ఒత్తిడిలో కూడా అద్భుతమైన షాట్లు ఆడుతూ మెరుపు ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందిస్తూ ఉంటాడు మహేంద్రసింగ్ ధోని.



ఇక ధోని ఉన్నాడు అంటే తప్పకుండా మ్యాచ్ గెలుస్తాము అన్న నమ్మకం ప్రేక్షకులలో ఉండేది. అయితే మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేసే మరో క్రికెటర్ లేకుండా పోయాడు అని చెప్పాలి. అయితే యంగ్ ప్లేయర్ రిషబ్ పంత్ ధోని వారసుడు అంటూ పేరు సంపాదించుకున్నాడు. కానీ అటు ధోనీలాగా బ్యాటింగ్లో కీపింగ్ లో మెరుపులు మెరిపించ లేకపోయాడు. ఇటీవల కాలంలో బ్యాటింగ్ పరవాలేదని అనిపిస్తున్నా కీపింగ్ లో మాత్రం ధోని లాగా మెరుపు వేగం చూపించలేక పోతున్నాడు. ఇకపోతే ఇటీవల జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో సంజూ శాంసన్ కీపర్ గా అదరగొట్టాడు.. బ్యాట్స్మెన్గా ఇరగదీశాడు.


 ఇక కీపింగ్ లో మెరుపువేగంతో డైవ్ చేస్తూ మరి క్యాచ్ లు అందుకున్నాడు. జట్టు పరిస్థితులకు అనుగుణంగా  నిలకడగా రాణిస్తూ 43  పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈక్రమంలోనే సంజూ శాంసన్ పై ఎంతో మంది ప్రశంసలు కురిపించడం మొదలు పెడుతున్నారు అని చెప్పాలి. మహేంద్ర సింగ్ ధోనీ వారసులు దినేష్ కార్తీక్ రిషబ్ పంత్ కాదు సంజూ శాంసన్ అంటూ ఎంతోమంది సంజు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక రానున్న రోజుల్లో సంజూ శాంసన్ ప్రస్థానం టీమిండియాలో ఎలా సాగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: