కుల్దీప్ యాదవ్.. ఒకప్పుడు తన స్పిన్ బౌలింగ్ తో టీమిండియాలో స్టార్ బౌలర్ గా ఎదిగాడు.  ఇతనికి స్థానం టీమిండియాలో సుస్థిరం అయినట్లే అని అందరూ భావించారు. కానీ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపించడంలో విఫలమయ్యాడు కుల్దీప్ యాదవ్. కొన్నాళ్లపాటు కీలక సమయంలో వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర వహించినప్పటికీ ఆ తర్వాత కాలంలో మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయాడు. ఇక అదే సమయంలో మరి కొంత మంది కొత్త స్పిన్నర్లు వెలుగులోకి రావడంతో అతనికి జట్టులో స్థానం లేకుండా పోయింది అని చెప్పాలి.


 ఒకవేళ స్థానం వచ్చిన అడపాదడపా అవకాశాలు మాత్రమే అందుకున్నాడు. అయితే వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవడంలో కుల్దీప్ యాదవ్ పూర్తిగా విఫలం అయ్యాడు అని చెప్పాలి.  కానీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ఉన్నాడు కుల్దీప్ యాదవ్. అయితే ఇటీవల జింబాబ్వేతో జరిగిన సిరీస్లో కుల్దీప్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపై అటు మాజీ ఆటగాడు మహ్మద్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జింబాబ్వేతో సిరీస్లో రెండో వన్డే మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ ఎందుకో అయోమయంలో ఉన్నట్లు కనిపించాడు అంటూ చెప్పుకొచ్చాడు.


 తన బౌలింగ్ స్పీడ్ విషయంలో అయోమయం లో ఉన్నట్లు కనిపించాడు. ఈ విషయం అతని బౌలింగ్ రిథం లోనే అర్థమవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో బాగా ఆడాడు. అయితే మరి కొన్ని మ్యాచులు ఆడిన తర్వాత అతడు మరింత మెరుగవుతాడు అన్నది చెప్పవచ్చు అంటూ మహ్మద్ కైఫ్ కుల్దీప్ యాదవ్ ఆటపై రివ్యూ ఇచ్చాడు అని చెప్పాలి.  కాగా ఇటీవలే రెండో వన్డే మ్యాచ్లో భాగంగా కుల్దీప్ యాదవ్ ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలోనే 49 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.  ఇది అంత దారుణమైన ప్రదర్శన కాదని అతని పై విమర్శలు చేయాల్సిన పని లేదు అంటూ మహమ్మద్ కైఫ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: