సాధారణంగా సినీ సెలబ్రిటీల తో పోల్చి చూస్తే అటు క్రికెటర్లకు సోషల్ మీడియాలోకి కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఎంత క్రేజ్ ఉంటుంది అంటే  ఎంతో మంది క్రికెటర్లు సోషల్ మీడియా లో పెట్టె ఒక్కో పోస్టు ద్వారా ఏకంగా కోటి రూపాయలు సంపాదిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఇలా ఇటీవల కాలంలో అటు అంతర్జాతీయ క్రికెట్ లో బాగా రాణిస్తున్న ఆటగాళ్లు ఎవరు అనేది ఎలా చూస్తున్నారో సోషల్ మీడియాలో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన క్రికెటర్లు ఎవరు అన్నది కూడా ప్రస్తుతం పరిగణలోకి తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు.


 అయితే గత కొంత కాలం నుంచి అత్యంత ప్రజాదరణ కలిగిన క్రికెటర్ల జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ముందు స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి. మిగతా క్రికెటర్లు అందరి తో పోల్చి చూస్తే కాస్త ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువగా ఉండడమే కాదు ఎక్కువమంది నెటిజన్లు వెతికే క్రికెటర్గా కూడా విరాట్ కోహ్లీ రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇలా ఒక వైపు క్రికెట్లోనే కాదు మరోవైపు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ పరంగా కూడా తనకు తిరుగు లేదు అని నిరూపిస్తున్నాడు అని చెప్పాలి. గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.


 అయితే విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్లో ఉన్నప్పటికీ తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయినప్పటికీ అత్యంత ప్రజాదరణ కలిగిన క్రికెటర్ల జాబితాలో మాత్రం నెంబర్ వన్ స్థానం లోనే ఉన్నాడు అనేది తెలుస్తుంది. ఆర్ మాక్స్ ఇండియా నిర్వహించిన సర్వేలో భాగంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ నిలిచాడు. సోషల్ మీడియా తో పాటు ఇతర ప్లాట్ఫామ్ లో సర్వే నిర్వహించగా జూలై నెలలో మోస్ట్ పాపులర్ క్రీడాకారుల లిస్ట్ రిలీజ్ చేసింది ఆర్ మాక్స్ ఇండియా. ఇందులో కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా.. తర్వాత స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, క్రిస్టియానో రోనాల్డో లియోనల్ మెస్సీ, హార్దిక్ పాండ్యా, సానియా మీర్జా,  పీవీ సింధు, కేఎల్ రాహుల్ వరుసగా పది స్థానాలలో చోటు దక్కించుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: