ఆసియా కప్లో భాగంగా ఆగస్టు 28 వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. రేపు సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కాబోయే ఈ మ్యాచును వీక్షించేందుకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధమైపోయారు. దుబాయ్ లోని షేక్ జాయెద్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. గత ఏడాది టి20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ పై ఎదురైన ఘోర పరాభవాన్ని ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది భారత జట్టు.


 దీంతో ఇక రేపు జరగబోయే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మునుపెన్నడూ లేని విధంగా ఉత్కంఠగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్ లో అటు విరాట్ కోహ్లీ ప్రదర్శన ఎలా ఉండబోతుంది అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. ఇక భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీనీ ఒక అరుదైన రికార్డు ఊరిస్తోంది. పాకిస్థాన్తో మ్యాచ్ విరాట్ కోహ్లీకి వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం. టీ20 లలో వంద మ్యాచ్ లు పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్  కోహ్లీ చరిత్ర సృష్టించబోతున్నాడు.


 అంతేకాదు విరాట్ కోహ్లీ మరో 7 సిక్సర్లు కొట్టాడు అంటే చాలు టీ20లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత 100 సిక్సర్లు బాదిన రెండవ భారత క్రికెటర్గా రికార్డుల్లోకి ఎక్కుతాడు విరాట్ కోహ్లీ. అంతేకాకుండా పొట్టి ఫార్మాట్ లో మరో 374 పరుగులు చేస్తే 11 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్గా చరిత్రలో నిలిచిపోతాడు. అయితే గత కొంత కాలం నుంచి పేలవమైన ఫాంలో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ  ఎంత వరకు రాణించగలుగుతాడు అన్నది మాత్రం ఆసక్తికరంగా  మారిపోయింది ఎలా చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: