గత కొంత కాలం నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో టీమిండియా అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంది. ముఖ్యం గా ఆసియా కప్ ముందు వరకు కూడా ఒక దేశ పర్యటన ముగియ గానే మరో దేశ పర్యటనకు వెళుతూ వరుసగా వన్డే, టి20 సిరీస్ లు ఆడింది అన్న విషయం తెలిసిందే. అంతే కాదు అటు ఆతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యం సాధించి వరుస సిరీస్ లలో విజయం సాధించింది. ఫార్మట్ తో సంబంధం లేకుండా సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి. ముఖ్యం గా వన్డే ఫార్మాట్లో అయితే తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగించింది టీమిండియా.


 జట్టులో ఆటగాళ్లను మారుస్తూ ఎన్ని ప్రయోగాలు చేస్తూ ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం టీమిండియా వెంటే ఉంది. ఈ క్రమం లోనే  ఆతిథ్య జట్టుపై కూడా విజయం సాధించింది తిరుగులేదు అని నిరూపించింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేయడం గమనార్హం. గత కొంత కాలం నుంచి అద్భుతంగా రాణిస్తూ ఉన్న టీమిండియా మూడో స్థానం లో నిలిచింది అని చెప్పాలి.  111 పాయింట్ల తో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది టీమిండియా. ఈ లిస్టులో 119 పాయింట్ల తో ఇంగ్లాండ్ జట్టు తొలి స్థానం  లో కొనసాగుతోంది.



 117 పాయింట్ల తో న్యూజిలాండ్ జట్టు రెండవ స్థానం దక్కించుకుంది అని తెలుస్తోంది. ఇక భారత్ తర్వాత నాలుగు,ఐదు, ఆరు స్థానాల్లో వరుసగా పాకిస్తాన్ ఆస్ట్రేలియా సౌతాఫ్రికా జట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవలే ఐసీసీ విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్ లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే  మొన్నటివరకు సిరీస్లలో వరుస విజయాలతో పోయిన టీమిండియా ఇటీవలే ఆసియా కప్ లో మాత్రం నిరాశపరిచింది. ఫైనల్ కు వెళ్లకుండా వరుస పరాజయాలతో ఇంటి బాట పట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: