విరాట్ కోహ్లీ పేరు చెప్పగానే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ గుర్తుకువచ్చేది అతను సాధించిన గొప్ప రికార్డులే. అందుకే అతని రికార్డుల రారాజు అని పిలుస్తూ ఉంటారు అభిమానులు.  ఇలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ ఎప్పుడు జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లి. మిగతా ఆటగాళ్లు అందరూ సెంచరీ చేయడానికి కష్టపడి పోతూ ఉంటే విరాట్ కోహ్లీ మాత్రం ఎంతో సునాయాసంగా రికార్డుల మోత మోగిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్లో ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు సాధించిన రికార్డులను అలవోకగా సాధించాడు కోహ్లీ.


 ఎన్నో రికార్డులను బ్రేక్ చేసి తన పేరును లిఖించుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గత కొంతకాలం నుంచి మాత్రం ఫామ్ను కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు కోహ్లీ. సెంచరీ కూడా చేయలేక పోయాడు అని చెప్పాలి. తద్వారా ఇక రికార్డుల వేటకు కాస్త దూరం అయ్యాడు. కానీ ఇటీవలే ఆసియా కప్లో భాగంగా మళ్ళీ అప్పటి ఫామ్లోకి వచ్చాడు అనేది మాత్రం అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగి పోయాడు. ఇక విరాట్ కోహ్లీ ఇటీవలే ఆసియా కప్లో భాగంగా ఆప్ఘనిస్తాన్లో జరిగిన మ్యాచ్లో 60 బంతుల్లో 122 పరుగులు చేశాడు.


 తద్వారా ఓ అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ 122 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ టి20 ఫార్మాట్లో ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాడిగా మొదటి స్థానం లోకి దూసుకుపోయాడు. అయితే ఇప్పటి వరకు ఈ రికార్డు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది అని చెప్పాలి.  2017 లో రోహిత్ శర్మ శ్రీలంకపై 118 పరుగులు చేశాడు.  ఇప్పుడు వరకు టి20 ఫార్మాట్లోనే  ఏ ఆటగాడు కూడా  ఈ వ్యక్తిగత స్కోరును బ్రేక్ చేయలేకపోయాడు అని చెప్పాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ పై సాలిడ్ ఇన్నింగ్స్ ఆడి అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: