క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెటర్లు తమ సహచర ఆటగాళ్లకు అప్పుడప్పుడూ కాస్త విచిత్రంగా ప్రవర్తించి సరదాగా జోకులు వేయడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మరింత హాస్య చతురత కలిగిన క్రికెటర్లు కేవలం సహచర ఆటగాళ్లతో మాత్రమే కాదు ప్రత్యర్థి ఆటగాళ్లతో కూడా సరదాగా ఏదో ఒక సంభాషణ చేయడం లేదా సరదాగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా సహచరులు ప్రత్యర్థులతో అప్పుడప్పుడు పరాచకాలు ఆడుతూ ఉంటారు కానీ అంపైర్ల  జోలికి మాత్రం దాదాపుగా ప్లేయర్స్ ఎవ్వరూ పోరు అని చెప్పాలి.


 ఎందుకంటే అంపైర్ల  జోలికి వెళ్ళినప్పుడు అది ఏమాత్రం బెడిసికొట్టిన కూడా చివరికి ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించి నట్లు అవుతుంది. తద్వారా ఇక జరిమానా పడే అవకాశం కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.. కానీ కొంతమంది ప్లేయర్లు మాత్రం అంపైర్ల తో   కూడా సరదా సంభాషణలు చేయడం విచిత్రంగా ప్రవర్తించడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేస్తే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.  ఆసియా కప్లో శ్రీలంక పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇలాంటి ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.


 ఆసక్తి కరంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో చివరికి శ్రీలంక జట్టు విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ఆరవసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది లంక జట్టు. అయితే శ్రీలంక బ్యాట్స్ మెన్ భానుక రాజపక్సా కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. తన బ్యాటింగ్ తో అదరగొట్టేశాడు. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో బంతి బ్యాట్ కు తగిలి నట్లుగా అనిపించడంతో పాకిస్తాన్ ఎల్ బి డబ్ల్యు  అప్పీల్ చేసింది. కానీ అది నాటౌట్గా తేలింది. ఇక ఆ సమయంలో అంపైర్ వద్దకు వెళ్లిన పాకిస్థాన్ ఆటగాడు షాదాబ్ సరదాగా అంపైర్   చేతిని పైకి లేపుతూ అవుట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఇక దీంతో అంపైర్  కూడా నవ్వుతున్నాడు అని చెప్పాలి. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: