భారత మహిళల జట్టు ఇంగ్లాండ్ పర్యటన లో ఉంది అన్న విషయం తెలిసిందే . ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టి20 సిరీస్తో పాటు వన్డే సిరీస్కు కూడా ఆడుతుంది. ఈ క్రమంలోనే ఇక ఈ పర్యటనలో మొదటి టి20 సిరీస్ ఆడింది భారత మహిళల జట్టు.  ఇక ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లో భాగంగా అనుకున్నంతగా రాణించలేకపోయింది అన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ లో ఓడిపోయి నిరాశపరిచిన భారత జట్టు రెండో మ్యాచ్లో మాత్రం మళ్లీ పుంజుకొని విజయంతో సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.


 కానీ అటు మూడవ టీ20 మ్యాచ్ లో మాత్రం ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించడంతో చివరికి 2-1 తేడాతో సిరీస్ ఇంగ్లాండ్కు కైవసం చేసుకుంది.  దీంతో భారత అభిమానులు అందరూ కూడా నిరాశ లో మునిగి పోయారు అని చెప్పాలి.  టీ20 సిరీస్  ఓడిపోయిన  భారత మహిళల జట్టు ఇక ఇప్పుడు వన్డే సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. వన్డే సిరీస్లో అయినా టీమిండియా జట్టు సత్తా చాటుతూ ఉందా లేదా అని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్లోనే అదరగొట్టేసింది టీమిండియా.


 ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత మహిళల జట్టు భారీ లక్ష్యాన్ని కూడా ఎంతో అలవోకగా ఛేదించింది.  స్మృతి మందాన 91 పరుగులు చేసి అదరగొట్టింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 74 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడింది. యాస్థిక బాటియా 50 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించింది. తద్వారా తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భాగంగా ముందు బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 227పరుగులు చేసింది.228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్ ప్రీత్ సేన 44.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. తర్వాత మ్యాచ్ లలో కూడా ఇదే జోరు కొనసాగించి వన్డే  సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి: