ప్రస్తుతం టి20 ప్రపంచ కప్ కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అక్టోబర్ 16వ తేదీన ఆస్ట్రేలియా వేదికగా ఈ మెగా టోర్ని  ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే అన్ని జట్లు కూడా ప్రపంచ కప్లో విజయం సాధించడమే లక్ష్యంగా తమ ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. ఏ ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై అన్ని రకాల ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నాయ్. ఈ క్రమంలోనె టీమ్ ఇండియా మాత్రం ఇంకా కొంతమంది ఆటగాళ్లు సెలెక్షన్ విషయంలో తర్జనభజన పడుతుంది అన్నది తెలుస్తుంది. ముఖ్యంగా కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇద్దరు ప్లేయర్ల విషయంలో తలలు పట్టుకుంటున్నారట.


 అయితే ఇలా కోచ్ కి కెప్టెన్ కి తలనొప్పిగా మారిన ఆటగాళ్లు ప్రస్తుతం టీమిండియాలో ప్రధాన బౌలర్లుగా కొనసాగుతూ ఉండడం గమనార్హం. అయితే ఇటీవల కాలంలో మాత్రం వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ నిరాశ పరుస్తూనే ఉన్నారు. ఆసియా కప్ ముందు వరకు బాగా రానించి ఇక ఇప్పుడు మాత్రం టి20 వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో పేలవమైన పర్ఫామెన్స్ తో నిరాశ పరుస్తున్నారు. ఆ ఇద్దరు బౌలర్లు ఎవరో కాదు భువనేశ్వర్ కుమార్, చాహల్. ఆసియా కప్ లో కూడా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ పేలవంగా మారిపోయింది.


 ముఖ్యంగా డెత్ ఓవర్ లో భువనేశ్వర్ కుమార్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఇంకోవైపు చాహల్ వికెట్లు తీయకపోవడమే కాదు భారీగా పరుగులు సమర్పించుకుంటూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే వీరి పేలవ ప్రదర్శన పై ప్రస్తుతం అభిమానులు కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇద్దరినీ పక్కన పెట్టి వేరే వాళ్లకు అవకాశం ఇవ్వాలి అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.  చాహల్ ప్లేస్ లో రవిచంద్రన్ అశ్విన్ ను జట్టులోకి తీసుకొని ఇక భువనేశ్వర్ కుమార్ స్థానంలో దీపక్ చాహర్ ను తీసుకోవాలని తద్వారా టీమిండియా ఎంతో పటిష్టంగా మారుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఈ ఇద్దరు విషయంలో టీమిండియా యాజమాన్యం ఎలాంటి ప్రణాళికతో ముందుకు సాగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: