మొన్నటి వరకు ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం ఇప్పుడు మాత్రం మళ్లీ తన మునుపడి ఫామ్ లోకి వచ్చాడు అని చెప్పాలి. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ భారీగా పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించే బాబర్ అజం మరోసారి తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ లతో అదరగొడుతున్నాడు. కాగా ప్రస్తుతం పాకిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య ఏడు టి20ల సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీ పోరు జరుగుతుంది. ఇకపోతే ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన ఆరవ టి20 మ్యాచ్లో 53 బంతుల్లోనే 81పరుగులు చేసి మరోసారి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు బాబర్.


 అంతేకాకుండా ఇక అంతర్జాతీయ టీం 20 లలో తన కెరీర్లో 29వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు అని చెప్పాలి. అయితే 81 పరుగుల వద్ద ఎంతో జోరు మీద ఉన్న బాబర్ అజాం సెంచరీ చేయడం పక్క అని అందరూ అనుకున్నారు. కానీ చివరికి వికెట్ కోల్పోయాడు. ఇకపోతే బాబర్ అజాం తన కెరీర్లో 29వ హాఫ్ సెంచరీ  నమోదు చేసిన నేపథ్యంలో ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా అంతర్జాతీయ టి20 లో ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ లిస్టు చూసుకుంటే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నాడు అన్నది తెలుస్తుంది.


 100 ఇన్నింగ్స్ లలో విరాట్ కోహ్లీ 34 హాఫ్ సెంచరీలు నమోదు చేసి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ 132 ఇన్నింగ్స్ లలో 32 హాఫ్ సెంచరీలు నమోదు చేసి రెండవ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవలే తన కెరీర్లో 29వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బాబర్ అజాం మూడవ స్థానంలో ఉన్నాడు. అయితే 81 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధించాడు. తర్వాత 91 ఇన్నింగ్స్ లో 23 హాఫ్ సెంచరీలతో డేవిడ్ వార్నర్.. 121 ఇన్నింగ్స్ లో 22 హాఫ్ సెంచరీలతో మార్టిన్ గప్తిల్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: