ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగి రోజులు గడుస్తున్న ఇక ఈ మ్యాచ్ కి సంబంధించిన చర్చ మాత్రం ఇంకా ఆగడం లేదు అని చెప్పాలి. ఇక ఎవరో ఒకరు ఈ మ్యాచ్ కు సంబంధించి ఏదో ఒక విషయాన్ని తెరమీదకి తీసుకురావడం ఇక దానిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం లాంటివి చేస్తున్నారు. అయితే ఇక నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ పై భారత జట్టు విజయం సాధించింది. అయితే టీమిండియా విజయం సాధించింది అంటే అందుకు కారణం ఎవరు అంటే ప్రతి ఒక్కరు విరాట్ కోహ్లీ అని గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తుంటారు.


 కఠిన పరిస్థితుల మధ్య సింగిల్స్ తీయడమే కష్టం అనుకుంటున్నా సమయంలో సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయిన రన్ మిషన్ చివరికి జట్టును గెలిపించాడు. 53 బంతుల్లో 82 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. అయితే ఒకానొక సమయంలో తానే ఏకంగా మ్యాచ్ మొత్తాన్ని చెడగొడుతున్నాను అన్న భావన నాకు కలిగింది అంటూ విరాట్ కోహ్లీ ఇటీవల తన బ్యాటింగ్ గురించి చెప్పుకొచ్చాడు. 7 పరుగుల వద్ద ఒక వికెట్ కోల్పోయిన సమయంలో కోహ్లీ క్రీజు లోకి వచ్చాడు. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, అక్షర్ పటేల్ కూడా పెబిలియన్ చేరారు. 31 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో మునిగిపోయింది టీమిండియా.


 విరాట్ కోహ్లీ అయితే 21 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు చేశాడు. ఇలాంటి సమయంలో తాను అసహనానికి గురయ్యాను అంటూ చెప్పుకోచాడు. నేను 21 బంతుల్లో 12 పరుగులు చేసినప్పుడు నేను మ్యాచ్ చెడగొట్టేస్తున్నానేమో అని అనిపించింది. బంతిని అనుకున్నట్లుగా గ్యాప్స్ లోకి పంపలేకపోయాను. అయితే అనుభవంతో పాటు చివరికి వరకు క్రీజు లో ఉండటం ఎంతో అవసరం అని నాకు తెలుసు. ఇక భారత జట్టులో నా పాత్ర ఎప్పటినుంచో అదే   అందుకే చివర్లో భారీ షాట్లు ఆడొచ్చు అని నమ్మకంతో ఉన్నాను. ఇక చివర్లో ఛాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు కొడుతూ ఇక భారీగా పరుగులు చేయడానికి ప్రయత్నించాను అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: