గత కొంత కాలం నుంచి అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న భారత క్రికెటర్ పేరు సూర్య కుమార్ యాదవ్. తక్కువ సమయం లోనే అగ్రశ్రేణి బ్యాటర్ గా గుర్తింపు సంపాదించుకున్న సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం టీమిండియా జట్టు లో నాలుగవ స్థానంలో నమ్మదగిన ఆటగాడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఈ క్రమం లోనే టీమిండియా ఏ ఫార్మాట్లో మ్యాచ్ ఆడినా కూడా అందులో సూర్యకుమార్ యాదవ్ తప్పకుండా ఉంటున్నాడు అని చెప్పాలి.


 అయితే మైదానం లోకి వచ్చిన తర్వాత కుదురుకోవడానికి ఎలాంటి సమయం తీసుకోకుండా రావడం రావడమే సిక్సర్లు ఫోర్ లతో చెలరేగి పోతూ ఉంటాడు. అంతే కాకుండా మైదానం నలు వైపులా ఎంతో అలవోకగా సిక్సర్లు కొడుతూ అటు మిస్టర్ 360 ప్లేయర్ గా కూడా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించు కున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఈ క్రమం  లోనే ఇప్పటికే అతనిపై ఎంతో మంది విదేశీ క్రికెటర్లు మాజీ ఆటగాళ్లు సైతం ప్రశంసలు కురిపించారు. ఇకపోతే ఇటీవల నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ తో అదర గొట్టాడు.


 కాగా ఇక సూర్య కుమార్ యాదవ్ ప్రదర్శన పై నెదర్లాండ్స్ బౌలర్ పాల్వాన్ మేకరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మల కంటే జట్టులో సూర్య కుమార్ యాదవ్ ప్రమాదకర ఆటగాడని.. అతను ఆడుతున్నప్పుడు ఎంతో ఒత్తిడికి గురయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే విరాట్ రోహిత్ లు వారి శైలిలో గొప్పగా ఆడతారు. అయితే వారితో పోలిస్తే సూర్య కుమార్లో పొరపాట్లకు ఆస్కారం చాలా తక్కువ. బౌలింగ్లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న మూల్యం చెల్లించుకోవాల్సిందే. సూర్య కుమార్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను ఎంతో ఒత్తిడికి గురయ్యాను. ఇక టీమ్ ఇండియా తో మ్యాచ్ అంటే ఇలాగే ఉంటుంది అంటూ పాల్వాన్ మేకరన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: