టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి ప్రస్తుతం వరుసగా రెండు ఓటములతో సమీస్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకున్న పాకిస్తాన్ పై ఆ దేశ క్రికెట్ అభిమానులు అందరూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు అని చెప్పాలి. కేవలం అభిమానులు మాత్రమే కాదు ఆ దేశం మాజీ క్రికెటర్లు సైతం ఇక పాకిస్తాన్ ఆటగాళ్ల ప్రదర్శన పై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రదర్శన పై ఎవరో ఒకరు మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.


 ఇక ఇటీవలే ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు సల్మాన్ ఘాట్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో టాప్ పొజిషన్లో ఉన్న మహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజాం లు సరైన ప్రదర్శన చేయడంలో విఫలం అయ్యారు అంటూ విమర్శలు గుప్పించాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లను చూసి క్రికెట్ ఎలా ఆడాలో నేర్చుకోవాలి అంటూ సలహా ఇచ్చాడు సల్మాన్ భట్. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఆటగాడు నుంచి నేర్చుకోవాలని పాకిస్తాన్ బ్యాటర్లు భావిస్తే ముందుగా విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలి. పాకిస్తాన్ పై, నెదర్లాండ్స్ మీద కూడా కోహ్లీ అద్భుతంగా ఆడాడు.


 పరుగుల కోసం అనవసరమైన ఆత్రుత పడకుండా ఎంతో ఆచితూచి ఆడుతున్నాడు. సమయం సందర్భం చూసుకుని కోహ్లీ కొట్టిన షాట్లు అద్భుతం. నేను నెంబర్ వన్ బ్యాట్స్మెన్ ని ఎలాగైనా ఆడొచ్చని కోహ్లీ అనుకోలేదు. సూర్య కుమార్ యాదవ్ వచ్చిన తర్వాత మళ్లీ తగ్గిపోయి సహకారం అందించాడు. ఇలా ఇద్దరు కూడా స్ట్రైక్ రొటేట్ చేస్తూ మంచి షాట్లు ఆడారు. రిస్క్ షాట్ లకి వెళ్ళకుండా స్కోరు బోర్డును నడిపించారు. అందుకే వీరిద్దరిని చూసి పాకిస్తాన్ బ్యాట్స్మెన్ నేర్చుకోవాల్సింది చాలానే ఉంది అంటూ సల్మాన్ బట్ వ్యాఖ్యానించాడు. కాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: