టి20 వరల్డ్ కప్ లో భాగంగా అటు టీమ్ ఇండియా ప్రదర్శన పై విమర్శలు చేస్తున్న మాజీ ఆటగాళ్లందరూ విరాట్ కోహ్లీ చేసిన ప్రదర్శన పై మాత్రం ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి. మొన్నటి వరకు ఫామ్ లో లేడు అని తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ.. ఇటీవలే వరల్డ్ కప్ లో మాత్రం అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి కూడా నేనున్నాను అనే భరోసా ఇచ్చాడు విరాట్ కోహ్లీ.

 తన అద్భుతమైన బ్యాటింగ్ తీరుతో 296 పరుగులు చేసి ఇక ఈ ఏడాది వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. అయితే గతంలో 2014 టి20 వరల్డ్ కప్ లో కూడా విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. అప్పుడు టీ20 వరల్డ్ కప్ లో 319 పరుగులు చేసిన కోహ్లీవరల్డ్ కప్ లో  అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇలా రెండు టీ20 వరల్డ్ కప్ టోర్నీలలో అత్యధిక పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్మెన్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.


 అయితే భారత క్రికెట్లో లెజెండరీ క్రికెటర్ మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తర్వాత ఇలా రెండు వరల్డ్ కప్లలో ఎక్కువ రన్స్ స్కోర్ చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించింది కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే అని చెప్పాలి. సచిన్ టెండూల్కర్ వన్డే వరల్డ్ కప్ లలో ఈ ఫీట్ సాధించాడు. 1996, 2003 వరల్డ్ కప్ టోర్నీలలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా సచిన్  రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఆ తర్వాత కోహ్లీ ఇప్పుడు రెండు సార్లు ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో ఆత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్ గా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: