న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఇటీవల టీ20 సిరీస్ ముగించుకుంది టీమ్ ఇండియా జట్టు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బలిలోకి దిగిన టీమిండియా జట్టు 1-0 తేడాతో న్యూజిలాండ్ పై టీ20 సిరీస్ విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ఇలా టీ20 సిరీస్ లో భాగంగా శుభారంభం చేసిన టీమిండియా జట్టు ఇక ఇటీవల ప్రారంభమైన వన్డే సిరీస్ లో మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయింది అని చెప్పాలి. ఇక ఇటీవల వన్డే సిరీస్లో భాగంగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో చివరికి న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. ఏకంగా ఏడూ వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా రెండవ వన్డే మ్యాచ్ ఇరు జట్లకు కూడా ఎంతో కీలకంగా మారిపోయింది. అయితే రెండో వన్డే మ్యాచ్లో గెలిచి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుని పరువు నిలబెట్టుకోవాలని భావిస్తుంది న్యూజిలాండ్ జట్టు. అదే సమయంలో ఇక రెండో వన్డే మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తుంది భారత జట్టు. మరోవైపు  వర్షం పడేందుకు 91% ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానం కూడా ఉంది.


 ఇకపోతే నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య జరగబోయే రెండో వన్డే మ్యాచ్లో విజయపజయాలు సిరీస్ ఫలితాన్ని నిర్ణయించడమే కాదు ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల పైన కూడా ప్రభావం చూపనుంది అన్నది తెలుస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే సిరీస్ లో నిలుస్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం సిరీస్ ను కోల్పోవడంతో పాటు ఇక సూపర్ లీగ్ లో రెండవ స్థానానికి పడిపోతుంది. కాగా ప్రస్తుతం టీమిండియా జట్టు 129 పాయింట్లతో  అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ జట్టు 120 పాయింట్లతో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: