భారత క్రికెట్ టీం కొన్ని రోజుల క్రితమే 2022 వరల్డ్ కప్ లో పాల్గొన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సిరీస్ లోకి ఇండియా క్రికెట్ టీం భారీ అంచనాలతో ఎంట్రీ ఇచ్చింది. ఆ అంచనాలకు తగినట్లుగానే 2022  వరల్డ్ కప్ లో టీం ఇండియా అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. అలాగే సిరీస్ స్టార్టింగ్ నుండి విజయాలను అందుకుంటూ టీం ఇండియా సెమీస్ వరకు వెళ్ళింది. సెమిస్ లో కూడా టీం ఇండియా అద్భుతమైన పర్ఫామెన్స్ ను ఇచ్చింది. కాకపోతే టీం ఇండియా సెమిస్ లో ఓడిపోయింది.

దానితో ఈ సంవత్సరం 2022 టి20 వరల్డ్ కప్ నుండి ఇండియా వెనక్కు తిరిగి రాకలేక తప్పలేదు.  ఇది ఇలా ఉంటే 2022 టి20 వరల్డ్ కప్ లో టీం ఇండియా మొదటి మ్యాచ్ ను పాకిస్తాన్ తో  అదింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అదిరిపోయే రేంజ్ ప్రదర్శనను కనబరిచిన విషయం కూడా మనకు తెలిసింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన అత్యుత్తమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అలాగే తన సూపర్ బ్యాటింగ్ పర్ఫామెన్స్ తో ఇండియాకు గెలుపును కూడా అందించాడు.

2022 టి20 వరల్డ్ కప్ లో బాగంగా విరాట్ కోహ్లీ  పాకిస్తాన్ మ్యాచ్ లో వరసగా కొట్టిన రెండు సిక్సర్ లను ఇప్పటికీ చాలా మంది మర్చిపోలేదు. అయితే తన బౌలింగ్ లో కోహ్లీ కొట్టిన సిక్సర్ లపై పాకిస్తాన్ బౌలర్ హారిస్ రాఫ్ తాజాగా స్పందించాడు.  కోహ్లీ ఓ మాస్టర్ క్లాస్ సూపర్ బ్యాటర్. అందుకే అతడు సిక్సర్లు కొట్టిన ఏ మాత్రం బాధ అనిపించలేదు. ఒక వేళ  కోహ్లీ కాకుండా హార్దిక్ పాండ్య లేక దినేష్ కార్తీక్ కానీ కొట్టినట్లు అయితే నేను బాధపడేవాడిని అని హరీస్ రఫ్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: